RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam

Continues below advertisement

 టీ20 పండగ మొదలైపోయింది. సమ్మర్ హీట్ ను మరింత పెంచేలా ఐపీఎల్ మహా సమరం సీజన్ 19 ఈరోజు నుంచి ప్రారంభమైపోతోంది. మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీని సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీకొట్టబోతోంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది తొలిసారి కప్పు సాధించిన ఆర్సీబీ..ఆ ఉత్సాహంతో బరిలోకి దిగుతుంటే..టీమ్ నిండా భారీ హిట్టర్లున్న సన్ రైజర్స్ ఈసారి రికార్డుల లెక్కలు తేల్చటంతో పాటు పదేళ్ల తర్వాత కప్పును మద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక జట్ల బలాబలాలను చూస్తే ఆర్సీబీ మేనేజ్మెంట్ మారిన ఉత్సాహంలో కింగ్స్ ఆర్మీలా కనిపిస్తోంది. కింగ్ విరాట్ కొహ్లీ ఎప్పట్లానే ఈ టీమ్ కి కొండంత బలం కానున్నాడు. లాస్ట్ సీజన్ లో 657 రన్స్ కొట్టిన కోహ్లీ ఫామ్ ను మరోసారి కొనసాగించాలని తప్పక భావిస్తాడు...కెప్టెన్ రజత్ పాటిదార్ కింగ్ కోహ్లీ డైరెక్షన్ లో ఇటు కెప్టన్సీలో అటు బ్యాటింగ్ లో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫిల్ సాల్ట్, జాకబ్ బెత్ హల్, టిమ్ డేవిడ్ తో పాటు KKR నుంచి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ పై అందరి దృష్టి ఉంది. బౌలింగ్ లో కొన్ని మ్యాచ్ లకు హేజిల్ వుడ్, యశ్ దయాల్ దూరం కావటం ఇబ్బంది పెట్టే విషయమే. భువనేశ్వర్ కుమార్ పై ఎక్కువగా ఆధారపడనున్నారు. లాస్ట్ సీజన్ లో ఎవే మ్యాచెస్ లో 7 గెలిచిన ఆర్సీబీ..హోం గ్రౌండ్ లో జరిగిన ఐదు మ్యాచుల్లో రెండు మాత్రమే గెలిచింది. ఇటు సన్ రైజర్స్ చూస్తే దాని బలం, బలగం అంతా బ్యాటింగే. అభిషేక్ శర్మ, ట్రావియెస్ హెడ్ తో మొదలుపెట్టి తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, మిడిల్ ఆర్డర్ లో లియామ్ లివింగ్ స్టన్ లాంటి విధ్వంసకారులు ఉన్నారు. సో ఈసారి ఏదో ఓ మ్యాచ్ లో 300 పరుగుల రికార్డు బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు. కానీ బౌలింగ్ అంతంతమాత్రమే. పర్మినెంట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లు ఆడే అవకాశం లేదు. జైదేవ్ ఉన్కదత్, హర్షల్ పటేల్ ఉన్నా ఎంత కన్సిస్టెన్సీతో బౌలింగ్ చేస్తారన్నది డౌటే. స్పిన్నర్ జీషన్ అన్సారీ, యంగ్ స్టర్ ఈషాన్ మలింగ కాస్త చూడదగ్గ బౌలర్లు. చూడాలి మొదటి మ్యాచ్ నుంచే కాటేరమ్మ కొడుకులు విజృంభిస్తారా..లేదా కింగ్స్ ఆర్మీ డిఫెండింగ్ ఛాంపియన్స్ మంటూ దుమ్ము లేపుతుందా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola