RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam

 ఐపీఎల్ లో ఫ్యాన్స్ బేస్ భారీగా ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆర్సీబీ ఒకటి. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐపీఎల్ ను కైవసం చేసుకున్న ఆర్సీబీ...ఈఏడాది డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. అయితే ఈ సీజన్ స్టార్ట్ అవ్వటానికే ముందే ఆర్సీబీ వార్తల్లోకి వచ్చింది దానికి రీజన్ ఓనర్ షిప్ ఛేంజ్. ఇన్నాళ్లూ ఆర్సీబీని నడిపించిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తమ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టడంతో ఆర్సీబీ అమ్మబడును బోర్డ్ న్యూస్ లోకి దూసుకొచ్చింది. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ ఉన్న టీమ్, పైగా లోయల్ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఆర్సీబీని దక్కించుకునేందుకు భారీ పోటీ కూడా నెలకొంది. ఏకంగా 17వేల కోట్ల రూపాయలతో ఆర్సీబిని దక్కించుకునేందుకు ఆయా సంస్థలు బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.  అయితే ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే స్వీడన్ కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ EQT ఆర్సీబీని తీసుకునేందుకు బాగా ఆసక్తి చూపింస్తోందట. సీరం ఇన్సిస్టిట్యూట్, మణిపాల్ గ్రూప్, లాన్సర్ క్యాపిటల్స్ లాంటి సంస్థలతో పోటీ పడుతున్న EQT మార్చి 31 నాటికి ఈ అక్విజిషన్ ప్రోసెస్ ను కంప్లీట్ చేయనున్నట్లు క్లారిటీ వచ్చింది. చూడాలి మాల్యా ఆర్సీబీ తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ చేతుల్లోకి వెళ్లింది. మరి ఇప్పుడు కోహ్లీ కి కాబోయే కొత్త బాస్ ఎవరో ఈ నెలాఖరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola