Ravindra Jadeja on 2027 World Cup | గిల్, గంభీర్ నాతో మాట్లాడిన తర్వాతే నన్ను తీసేశారు | ABP Desam

Continues below advertisement

 ప్రపంచంలోనే ప్రస్తుతం అత్యుత్తమ క్రికెట్ ఆల్ రౌండర్లలో ముందు వినిపించే పేరు రవీంద్ర జడేజా. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కొహ్లీ, రోహిత్ లతో కలిసి షార్ట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించేసిన జడ్డూ...టెస్టు క్రికెట్ లో మాత్రం తిరుగులేని ఫామ్ తో దుమ్ము రేపుతున్నాడు. అయితే వన్డేలకు తనను పెద్దగా కన్సిడర్ చేయకపోవటంపై మాట్లాడాడు రవీంద్ర జడేజా. విండీస్ తో జరుగుతున్న సిరీస్ లో వైస్ కెప్టెన్ గానూ వ్యవహరిస్తున్న జడ్డూ....రెండో రోజు ఆట తర్వాత ప్రెస్ మీట్ ను లీడ్ చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ కు తనను ఎంపిక చేయకపోవటంపై తనకు సమాచారం ఉందన్నాడు జడ్డూ. రోహిత్, కొహ్లీ లాంటి స్టార్ ప్లేయర్స్ చాలా గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇస్తున్న ఈ సిరీస్ ఆడకపోవటం తనకు బాధగానే ఉందన్న జడ్డూ...బట్ తనను ఎందుకు ఎంపిక చేయలేదో కెప్టె్న్ గిల్, కోచ్ గౌతం గంభీర్ తనకు క్లారిటీ ఇచ్చారని చెప్పాడు. వన్డే వరల్డ్ కప్ కి ముందు తక్కువ మ్యాచ్ లే ఉండటంతో యంగ్ స్టర్స్ను టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందన్న జడేజా...తనకు అవకాశం దొరికితే మాత్రం 2027 వరల్డ్ కప్ గెలవాలనే తపనతో ఉన్నానని చెప్పాడు. 2023 వరల్డ్ కప్ ను తృటిలో చేజార్చుకోవటం చెప్పలేని బాధను మిగిల్చిందని..సో ప్రపంచ కప్ లక్ష్యంగా తన సన్నద్ధత ఉందని చెప్పాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola