Ravichandran Ashwin Selected For Aus ODI Series: వరల్డ్ కప్ ప్లాన్స్ లోకి దూసుకొచ్చిన అశ్విన్
మీ అందరికీ 2019 ప్రపంచకప్ సెలక్షన్ సందర్భంగా నెలకొన్న వివాదం గుర్తుండే ఉంటుంది. తెలుగు ఆటగాడు అంబటి రాయుడిని కాదని, తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను సెలెక్ట్ చేశారు. ఇది పెద్ద చర్చకే దారి తీసింది. కొన్నాళ్ల పాటు ప్రధాన వార్తగా నిలిచింది. ఇప్పుడు మరో తమిళ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక్కసారిగా వరల్డ్ కప్ రేసులోకి రయ్ మంటూ దూసుకొచ్చాడు.