Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam

వాంఖడే స్టేడియం మరోసారి పరుగుల సుమానికి వేదికైంది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగిపొయ్యారు. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకోగా.. కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే అజింక్య రహానే బ్యాటింగ్‌. రహానే 40 బంతుల్లోనే 67 పరుగులు బాదాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. రహానేకు తోడుగా ఫిన్ ఆలెన్, రఘువంశీ ఆడడంతో కేకేఆర్ భారీ స్కోరు అందుకుంది. రింకూ సింగ్ చివర్లో తనదైన శైలిలో ఫినిషింగ్ ఇచ్చాడు.

ముంబై బౌలర్లలో స్టార్ ప్లేయర్స్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వికెట్లు తీయలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు. లోకల్ బాయ్ శార్దూల్ ఠాకూర్ మాత్రం అదరగొట్టాడు. రహానే, ఫిన్ ఆలెన్, కామెరూన్ గ్రీన్ వంటి కీలక వికెట్లు తీసి కేకేఆర్ స్కోరును కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola