On This Day | 11 Years Since India Won Worldcup 2011: MS Dhoni మెరుపులు, Yuvraj పోరాటం మర్చిపోలేనివి
28 ఏళ్ల కల నెరవేరిన రోజు... ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్న God of Cricket కు అద్భుతమైన Farewell ఇచ్చిన రోజు. ఆఖరి బాల్ సిక్స్ కొట్టగానే... 100 కోట్ల మంది ఒంటిపై సోయి లేకుండా సంబరాలు చేసుకున్న రోజు.... ఎస్.. అదే ఏప్రిల్ 2 2011. 28 ఏళ్ల తర్వాత టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన రోజు. కేవలం కప్పు గెలవడమే విశేషం కాదు. దీని లోపల ఎన్నో ఎమోషన్స్ దాగున్నాయి. Sachin Tendulkar కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలన్న పట్టుదల, Cancer తో పోరాడుతూనే Man of The Tournament గా నిలిచిన Yuvraj పోరాటం, Final లో వరుస Dives చేస్తూ వికెట్ కాపాడుకోవడానికి Gautam Gambhir చూపిన అంకితభావం.... లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. టోర్నీ అంతా పెద్దగా ఫాంలో లేకపోయినా... ఫైనల్లో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చి, 91 పరుగులు చేసిన Dhoni మాస్టర్ స్ట్రోక్. ఆ లాస్ట్ బాల్ సిక్స్ గురించి ఎప్పుడు తల్చుకున్నా, అంతెందుకు ఇప్పుడు మాట్లాడుతుంటేనే Goosebumps వస్తున్నాయి. వరల్డ్ కప్ గెలిచి 11 ఏళ్లు అవుతున్న సందర్భంగా Social Media లో నాటి Photos, Videos వైరల్ అవుతున్నాయి.