No Farewell for Teamindia players | దేశం కోసం ఆడిన ప్లేయర్లకి కనీసం ఫేర్‌వెల్ ఇవ్వరా? | ABP Desam

స్టార్ క్రికెటర్ల కెరీర్లు ఇలా అర్థాంతరంగా.. కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా లేకుండా ముగిసిపోవడానికి కారణం ఏంటి? అయితే తన కెరీర్ మధ్యలో ముగిసిపోవడానికి ధోనీనే కారణం అని నిన్న, మొన్నటి వరకు గంభీర్ మైక్ దొరికినప్పుడల్లా అంటుండేవాడు. మరి ఇప్పుడు గంభీర్ చేస్తుందేంటి? కనీసం ఒకప్పుడు ఫా‌మ్ లేకనో, ఏజ్ పెరగడం వల్లో రిటైర్ అయ్యేవాళ్లు ప్లేయర్స్. కానీ ఇప్పుడు..ఆడగలిగే ఫిట్‌నెస్ ఉండి.. ఆడాలనే కోరిక ఉన్నా.. విరాట్, రోహిత్, అశ్విన్, పుజారా.. లాంటి ప్లేయర్లు సడెన్‌ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు.మరి ఇందులో గంభీర్ రెస్పాన్సిబిలిటీ లేదా? వీళ్లకి కనీసం రెస్పెక్ట్‌ఫుల్ సెండ్‌ఆఫ్ ఇవ్వాల్సిన బాధ్యత కోచ్‌గా గంభీర్‌కి ఉండదా..? ఇదే ఇప్పుడు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ రెయిజ్ చేస్తున్న క్వశ్చన్స్. కానీ.. ఇక్కడ మీలో ఎవ్వరికీ తెలియని ఓ ఇన్‌విజిబుల్ ఫోర్స్ ఉంది. ఆ ఫోర్సే గంభీర్‌ని, మిగిలిన ప్లేయర్లని ముందుకు డ్రైవ్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఏది చెబితే అది ప్లేయర్లే కాదు.. కోచ్‌లు, సెలక్షన్ కమిటీలు అన్నీ వినాల్సిందే. ఆ ఫోర్సే బీసీసీఐ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola