MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ మళ్ళీ బ్యాట్ పట్టాడు. కాలు గాయం కారణంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన ధోనీ, ఇప్పుడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్ సిఎస్‌కేకు అత్యంత కీలకం. గత మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో దారుణంగా ఓడిపోయిన రుతురాజ్ సేన, ఇప్పుడు సొంత గడ్డపై గెలవాలని చూస్తోంది. ధోనీ నేరుగా బరిలోకి దిగకపోయినా, డగౌట్‌లో ఉండి ఇచ్చే సలహాలు రుతురాజ్ గైక్వాడ్‌కు బలంగా మారుతాయి. సంజూ శాంసన్, హోమ్ ఫ్యాన్స్ ముందు తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు.

మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ గత మ్యాచ్‌లో ఆకట్టుకోవడంతో, ఈసారి అతనికి మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ చాలా బలంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న పంజాబ్, అదే ఫామ్‌ను కొనసాగించాలని చూస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola