MS Dhoni Retention Uncapped Player IPL 2025 | తలా ధోనీ రాక కన్ఫర్మ్..క్లారిటీ ఇచ్చేసిన CSK | ABP
ఐపీఎల్ దగ్గరకు వస్తున్న కొద్దీ రిటెన్షన్ ప్లేయర్లపై టెన్షన్ పెరిగిపోతూ ఉంది. మెగా ఆక్షన్ కాస్తా మినీ ఆక్షన్ లా మారిపోతున్న టైమ్ లో ఏ ఐపీఎల్ టీమ్ ఏ ప్లేయర్ ను రిటైన్ చేసుకుంటుదనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంటున్న ఆరుగురు ప్లేయర్లు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మొట్టమొదటి రిటెన్షన్ ప్లేయర్ గా సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇక రెండో ప్లేయర్ గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. మూడో ప్లేయర్ గా సీఎస్కే ను గుర్తించి తయారు చేసిన శ్రీలంక బౌలర్ మతీశా పతిరానా ఉన్నాడు. నాలుగో ప్లేస్ కోసం డెవాన్ కాన్వే, ఐదో ప్లేస్ కోసం శివమ్ దూబే లేదా సమీర్ రిజ్వి నుంచి ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆరో స్థానంలో అన్ క్యాప్డ్డ్ ప్లేయర్ క్యాటగిరీలో సీఎస్కే తన ఐకాన్ మహేంద్ర సింగ్ ధోనిని తమ దగ్గరే ఉంచుకుంటోందని సీఎస్కే సీఈవో కాశీ దాదాపు గా కన్ఫర్మ్ చేశారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ క్యాటగిరీలో ధోని ఉండేలా ప్లాన్ చేసి మరీ ఐపీఎల్ రూల్స్ ను ఛేంజ్ చేసేశారు. గీజన్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ. లాస్ట్ ఇయర్ ముగిసే సరికి ఐపీఎల్ అనే పేరుకున్న బ్రాండ్ వాల్యూ లక్షా 35వేల కోట్ల రూపాయలు. అందులో మోస్ట్ వ్యాల్య్డూ ఫ్రాంచైజీగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 1900కోట్ల రూపాయల వ్యాల్యూ ఉంది సీఎస్కే టీమ్ కి. ఈ వ్యాల్యూ కి కారణం ఎమ్మెస్ ధోని అని ఐపీఎల్ అండ్ సీఎస్కే భావిస్తున్నాయి. అతని పేరు చెబితే తెగుతున్న టిక్కెట్లు, ఎండార్స్ మెంట్స్, ఫ్యాన్స్ క్రేజ్, బ్రాండ్ అథంటిసిటీ ఈ కమర్షియల్ లెక్కలన్నీ కలిపితే ఈ ఏడాది కూడా ధోని కొనసాగితే బాగుండుంటదనే ఐపీఎల్ యాజమాన్యం కూడా కోరుకుంటోంది. అందుకే రూల్స్ ఛేంజ్. శరీరం సహకరిస్తే ఆడతానని మాహీ కూడా చెప్పటంతోనే అన్ క్యాప్డ్ ప్లేయర్ గా కేవలం 4 కోట్ల రూపాయలకే ధోని 2025 ఐపీఎల్ ను 43ఏళ్ల వయస్సులో ఆడతాడని స్పష్టమైంది.