MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam

Continues below advertisement

 ఇదిగో రిటైర్మెంట్ అదిగో రిటైర్మెంట్ అంటూ ఎన్ని వార్తలు వస్తున్నా 44ఏట తన 19 వ ఐపీఎల్ సీజన్ ఆడేస్తున్న తలా మహేంద్ర సింగ్ ధోని...ఐపీఎల్ సీజన్ 19 ప్రారంభానికి కొన్ని గంటల ముందు అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే తలా ధోనికి గాయమైంది. హార్మ్ స్ట్రింగ్ ఇంజ్యూరీ కారణంగా ధోని రెండు వారాలు మ్యాచ్ లకు దూరం అవుతున్నాడని సీఎస్కే మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ ధోని ఫ్యాన్స్ కి ఎందుకంటే..ఈసారి అసలు టీమ్ లో ధోని రోల్ ఏంటో కూడా ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఓన్లీ రీజన్ సంజూ శాంసన్ ని ట్రేడ్ లో విపరీతమైన ఆసక్తి చూపించి మరీ తీసుకుంది CSK. అందుకోసం సీఎస్కే కి తురుపుముక్క లాంటి రవీంద్ర జడేజాను రాజస్తాన్ కు మార్చుకుంది. ఇంతిలా శాంసన్ ను తెచ్చుకున్న తర్వాత ధోని కీపింగ్ చేస్తాడా లేదా శాంసన్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా మాత్రమే బరిలోకి దిగుతాడా...ఏదీ కాదన్నట్లు ధోని ఆల్రెడీ మూడేళ్లుగా మోకాలిగాయంతో బాధపడుతున్నాడు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గా ఓన్లీ బ్యాటింగ్ ఆడిస్తాడా..అలా ఆడిస్తే ధోనికి ఉన్న అనుభవం డగౌట్ కే పరిమితం అవుతుంది కానీ..ఫీల్డ్ సెట్టింగ్స్ లో..కెప్టెన్ కి సలహాల విషయంలో అక్కర రాదు కదా ఇలా ఎన్నో వందల సందేహాలు ధోని చుట్టు ముట్టి ఉన్న ఈ టైమ్ లో ఎంఎస్ రెండు వారాలు మ్యాచ్ లు ఆడట్లేదని చావు కబురు చల్లగా చెప్పింది సీఎస్కే. ఇది నిజంగానే గాయంతో తీసుకుంటున్న రెస్టా...లేదా ధోని లేకుండా సీఎస్కే మ్యాచ్ లు ఆడటం ఫ్యాన్స్ చూడటం అలవాటు చేస్తోందా...ధోని అనే ఎమోషన్ ను ఎల్లో జెర్సీకి దూరం చేయాలని భావిస్తున్నారా మళ్లీ ఇవన్నీ మిలియన్ డాలర్స్ విలువ చేసే ప్రశ్నలే. చూడాలి ధోని లేని ప్లేస్ లో యంగ్ వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ ను తీసుకుంటారు అంటున్నారు. అతను దేశవాళ్లీ మ్యాచుల్లో డీప్ డౌన్ లో స్ట్రాంగ్ హిట్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ధోని లేని లోటును కనపడనివ్వకుండా చేస్తాడేమో. రెండు వారాలు అంటే సీఎస్కే ఈలోగా కనీసం నాలుగు మ్యాచులు ఆడుతుంది కాబట్టి టీమ్ కాంబినేషన్స్ సెట్ అవుతాయోమో. ఈ సీజన్ లో తమ ఫస్ట్ మ్యాచ్ చెన్నై రాజస్తాన్ తో మార్చి 30న ఆడనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola