MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP Desam
Continues below advertisement
క్రిస్మస్ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే మహేంద్ర సింగ్ ధోనీ అండ్ ఫ్యామిలీ కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ధోని ఈ సారి ముంబైలో ఉన్నాడు. తన భార్య సాక్షి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేసుకుంటున్న ఈ వేడుకల్లో ధోని శాంటాక్లాజ్ గా మారిపోయాడు. క్రిస్మస్ తాతగా సందడి చేస్తూ అందరినీ నవ్వించాడు. గిఫ్టులు పంచాడు. ఇంతకీ ధోని ఈ గెటప్ వేయటానికి కారణం తన కుమార్తె జివా ధోని అట. ధోనిని శాంటాక్లాజ్ వేషం వేసుకోవాలని కోరగానే ఇలా రెడీ అయిపోయి సర్ ప్రైజ్ చేశాడట. నాన్న ఇచ్చిన గిఫ్ట్ కి మురిసిపోయిన జివా..తండ్రికి ఓ క్యూట్ హగ్ ఇచ్చి నాన్న మీద తన ప్రేమను చాటుకుంది. హీరోయిన్ కృతిసనన్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. తను కూడా మాహీ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. అంతే క్షణాల్లో అవి వైరల్ గా మారిపోయాయి
Continues below advertisement