Mitchell Santner Praises Team India | టీమిండియాపై న్యూజిలాండ్ కెప్టెన్ ప్రశంసల జల్లు | ABP Desam

 టీ20 వరల్డ్ కప్ ఆడే ముందు టీమిండియా అత్యంత కఠినమైనదిగా భావించిన న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత్ అదరగొడుతోంది. మొదటి రెండు టీ20 ల మ్యాచ్ లను భారత్ అవలీలగా గెలిచేసుకుంది. నిన్న కివీస్ తో జరిగిన రెండో టీ20 మ్యాచులో భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని కూడా 15.2 ఓవర్లలోనే ఛేజ్ చేసి పారేసింది. అంటే భారత బ్యాటర్లు 92 బాల్స్ లోనే 209 పరుగులు బాదేశారు అన్న మాట. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ చెరో నాలుగు సిక్సులు కొడితే..దూబే మూడు సిక్సులు కొట్టాడు. నిజంగా బ్రూటల్ గా ఆడారు నిన్న మనోళ్లు. పాపం కివీస్ బౌలర్లు ఏం చేయలేని పరిస్థితి. జకారీ ఫోక్స్ అనే బౌలర్ అయితే 3 ఓవర్లు బౌలింగ్ చేసి 67 పరుగులు సమర్పించుకున్నాడు పాపం. భారత్ బ్యాటర్లు అలా విరుచుకుపడుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు. అందుకే మ్యాచ్ కంప్లీట్ అయ్యాక న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ భారత ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 209 పరుగులు సరిపోలేదంటారా అని కామేంటేటర్ అడిగిన ప్రశ్నకు..వాళ్లకా వాళ్లు ఎలా ఆడుతున్నారో చూశారుగా...300 పెట్టినా సరిపోదు వాళ్లకు అంటూ నవ్వేశాడు. త్వరలో వరల్డ్ కప్ ఉన్నందున భారత్ జట్టులో ప్రతీ బ్యాటర్ కసితో రగిపోతున్నాడని...209 పరుగులు లక్ష్య ఛేధనలో 15 ఓవర్లలోనే పూర్తి చేసేశారని ఇంకా ఆడే బ్యాటర్లు ఉన్నారని వాళ్లు కనీసం క్రీజ్ లోకి కూడా రాలేదని హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ ల గురించి కూడా మాట్లాడాడు శాంట్నర్. పాపం నిన్న మనోళ్ల దెబ్బకి న్యూజిలాండ్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచులోనూ భారత్ సత్తా చాటా సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola