Marais Erasmus World Cup 2019 Final Overthrow Mistake: వివాదాస్పద ఫైనల్ లో బయటపడ్డ మరో తప్పు

ఇప్పటికి 13 ప్రపంచకప్ ఫైనల్స్ జరిగాయి. 1983 కపిల్ డెవిల్స్ విరోచిత పోరాటం చూశాం. 2011లో ఎంఎస్ ధోనీ సిక్స్ చూశాం. కానీ అత్యంత వివాదాస్పద ఫైనల్ అంటే కచ్చితంగా... ఇంగ్లండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 2019 ఫైనలే. ముందు అసలు మ్యాచ్ టై అవడం, ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ కూడా టై అవడం, బౌండరీల కౌంట్ ద్వారా విజేతను నిర్ణయించడం.... ఇదంతా పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. అయితే ఇంగ్లండ్ ఛేజింగ్ ఆఖరి ఓవర్ లో... ఆన్ ఫీల్డ్ అంపైర్లు మారియస్ ఎరాస్మస్, కుమార్ ధర్మసేన.... పెద్ద తప్పు చేశారంట. ఆ విషయాన్ని లేట్ గా రియలైజ్ అయ్యామని, ఇప్పుడు స్వయంగా ఎరాస్మసే ఒప్పుకున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola