KL Rahul Curse Eng vs Ind Test Series | రాహుల్ ను ఔట్ చేసిన తర్వాత భయపడుతున్న ఇంగ్లండ్ బౌలర్లు | ABP Desam
కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ లో సిరీస్ లో సమర్థవంతంగా రాణించాడు. ఐదు టెస్టులు ఆడి 532 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే కేఎల్ రాహుల్ కు సంబంధించిన ఓ విషయం ఇంగ్లండ్ సిరీస్ లో ఇంగ్లీష్ బౌలర్లను భయపెడుతోంది. అదేంటంటే రాహుల్ వికెట్ తీసిన బౌలర్ ఔట్ అయిపోతున్నాడు. బౌలర్ ఔట్ అవ్వటం ఏంటీ అంటే...గాయం కారణంగా సిరీస్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఇది నిజంగా జరగుతోంది. మూడో టెస్ట్ నుంచి మొదలైంది ఈ ఆనవాయితీ. మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ కేఎల్ రాహుల్ వికెట్ తీశాడు. అయితే అనూహ్యంగా అదే టెస్టులో గాయపడి...సిరీస్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరం అయ్యాడు. నాలుగో టెస్టులో బెన్ స్టోక్స్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. పాత గాయమే తిరగబెట్టడంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ తన బాధ్యతలను ఓలీ పోప్ కు అప్పగించి తను కూడా ఐదో టెస్ట్ కి అందుబాటులో లేకుండా సిరీస్ నుంచి వైదొలిగాడు. ఇప్పుడు ఐదో టెస్టులో క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రాహుల్ ఔట్ అయ్యాడు. వోక్స్ కూడా అంతే. ఫీల్డింగ్ చేస్తూ భుజానికి గాయం కావటంతో వోక్స్ ఉన్నపళంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కూడా దిగలేని పరిస్థితి. అలా మూడు టెస్టుల్లో రాహుల్ వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు గాయాల కారణంగా సిరీస్ నుంచి ఔట్ అయిపోయారు. అయితే ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో జోష్ టంగ్ అనే బౌలర్ రాహుల్ ను ఔట్ చేశాడు. సో ఇప్పుడు భయమంతా జోష్ టంగ్ కే. ఇదంతా సరదా నెరేటివ్ లే కానీ ఇలా రాహుల్ వికెట్ తీసిన బౌలర్లంతా గాయాల బారిన పడి సిరీస్ నుంచి వైదొలుగుతుండటం చూస్తుంటే తనను ఔట్ చేసిన వాళ్లకు రాహుల్ శాపం పెడుతున్నాడంటూ ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.