Kashmir Willow Cricket Bat Manufacturing Vlog | దేశంలో ఐసీసీ అప్రూవ్ చేసిన క్రికెట్ బ్యాట్ ఫ్యాక్టరీ
క్రికెట్..! భారత్ లో కొన్ని కోట్లాది మంది ఆరాదంగా భావించే స్పోర్ట్. క్రికెట్ లో బ్యాటింగ్ చేయాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? క్రికెట్ బ్యాట్ లలో కేవలం రెండే రకాల విల్లో లు ఉంటాయి. ఇంగ్లీష్ విల్లో & కాశ్మీర్ విల్లో. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో బాటర్లు 2020 వరుకు కేవలం ఇంగ్లీష్ విల్లో వాట్లు వాడేవారు. కానీ ఇప్పుడప్పుడే మన భరత సంతతికి చెందిన కాశ్మీర్ విల్లో బ్యట్లు ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన ఘనత కశ్మీర్ లోని GR8 Sports Brand Kashmir Willow Bat Manufacturing Factory కు దక్కింది. 2021 లో ఐసీసీ approved brand గుర్తింపు సాధించిన మొట్ట మొదటి కశ్మీర్ విల్లో బ్రాండ్ గా నిలిచింది. ఆ తరువాత అనేక మంది అంతర్జాతీయ క్రికెటర్లు ప్రపంచ కప్ పోరులో ను ఈ కశ్మీర్ విల్లో బాట్లు వాడారు. వరుసగా మూడు ప్రపంచ కప్ టోర్నీల్లో ఒమన్, ఆఫ్గనిస్తాన్ , వెస్ట్ ఇండీస్ జట్టుల్లోని కొందరు ప్లేయర్స్ ఈ GR8 Kashmir Willow బాట్లను వాడటం తో మన కశ్మీర్ విల్లో బాట్లు ఇప్పుడప్పుడే ఇంగ్లీష్ విల్లొ కు ధీటుగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్నాయి. ఇంగ్లీష్ విల్లో కు 5 రెట్లు తక్కువ ధర, అంతే నాణ్యత కలిగిన బాట్స్ మనమూ తయారు చేయవచ్చని తెలిపారు GR8 స్పోర్ట్ అధినేత కబీర్. మరింత సమాచారం కోసం కాశ్మీర్ లో ABP దేశం చేసిన EXCLUSIVE VLOG చూసేయండి మరి