Kashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABP

Continues below advertisement

  ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే స్పోర్ట్ క్రికెట్. మనకిష్టమైన క్రికెటర్లు రకరకాల షాట్స్ ను ఆడటానికి ఉపయోగించే బ్యాట్స్ వాటి ఇంపార్టెన్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ తెలుసుకోవటం క్యూరియస్ గా ఉంటుంది కదా. క్రికెట్ లో వాడే బ్యాట్ లలో కేవలం రెండే రకాల విల్లో లు ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ విల్లో  రెండోది కాశ్మీర్ విల్లో. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో బాటర్లు 2020 వరుకు కేవలం ఇంగ్లీష్ విల్లో వాట్లు వాడేవారు. కానీ ఇప్పుడప్పుడే మన దేశం లో తయారయ్యే కాశ్మీర్ విల్లో బ్యాట్లు ప్రపంచ స్థాయి గుర్తింపు సాధిస్తున్నాయి.  2021 తరువాత అనేక మంది అంతర్జాతీయ క్రికెటర్లు వరల్డ్ కప్పులోనూ కశ్మీర్ విల్లో బ్యాట్లు వాడుతున్నారు.

 

ఇంగ్లీషు విల్లో కంటే మూడు రెట్లు ధర తక్కువతో..అంతే స్థాయి నాణ్యతతో ఉండే కశ్మీర్ విల్లో బ్యాట్లను కశ్మీర్ లోని అనంతనాగ్ ప్రాంతంలో కొన్ని వందలాది కుటుంబాలు తయారు చేస్తూ ఉంటాయి. 

మరి ఈ బ్యాట్లు తయారు చేయటానికి అనుసరించే విధానాలు ఏంటో చూసేద్దాం.


1. విల్లో ఎంపిక (Tree Selection): విల్లో చెట్ల చెక్క నుంచి  కాశీర్ విల్లో బ్యాట్ లను తయారు చేస్తారు.  సాధారణంగా 10 నుండి 15 సంవత్సరాలు వయసు గల విల్లో చెట్లను బ్యాట్ల తయారికి వాడుతారు. 

2. కట్టింగ్ & సీజనింగ్ ప్రక్రియ(Cutting & Seasoning Process): 

ఈ దశ లో ఎంపిక చేసిన విల్లో చెట్లను జాగ్రత్తగా కట్ చేయిస్తారు. నాణ్యత, గ్రేడ్ ఆధారంగా మంచి చెట్లను ఎంపిక చేస్తారు. కత్తిరించిన చెట్లను రెండు సంవత్సరాల పాటు ఎయిర్-డ్రై చేయడం ద్వారా చెక్కలో తేమ తగ్గి క్రికెట్ ఆడేందుకు  అనుకూలంగా మారుస్తారు. ఇదిగో ఇలా ఎయిర్-డ్రై తర్వాత లాగ్‌లను చిన్న చెక్కలు గా కోస్తారు. 

3. బ్యాట్ షేపింగ్ (Bat Shaping): 

విల్లో చెక్కలు బ్యాట్ ఆకారంలో కట్టింగ్ చేసిన తరువాత బ్యాట్ బ్లేడ్ ఇంకా హ్యాండిల్ ఆకారాలను కూడా చెక్కుతారు. బ్యాట్ తయారు చేసే ప్రక్రియ లో అత్యంత ముఖ్యమైన బ్లేడ్ హ్యాండిల్‌ తయారీలో కచ్చితమైన పరిమాణాలను సాధించేందుకు వివిధ యంత్రాలు ఉపయోగించి బ్యాట్ లను షేప్ చేస్తారు.

 4. ప్రెస్సింగ్ (Pressing):  బ్యాట్ బ్లేడ్‌ను మెకానికల్ ప్రెస్ ను ఉపయోగించి వత్తుతారు. ఈ ప్రక్రియ బ్యాట్ క్వాలిటీ అండ్ బాల్ ఇంపాక్ట్ ను తట్టుకోవడానికి ఉపయోగ పడుతుంది. బ్లేడ్ ప్రెసింగ్ ప్రక్రియబ్యాట్ పనితీరును అది ఎక్కువ కాలం మన్నేలాను తయారు చేస్తుంది.

5. గ్రేడింగ్ (Grading):  విల్లో లో ఉండే గ్రైన్స్ ను  బట్టి బ్యాట్ లను కావాల్సినట్లుగా చెక్కుతారు.చివరగా బ్యాట్ గ్రైన్స్ & నాణ్యత ఆధారంగా బ్యాట్లను  గ్రేడింగ్ ప్రక్రియ చెస్తారు.

6. శాండింగ్ (Sanding): చివరగా బ్యాట్‌ను నున్నగా మార్చడానికి శాండింగ్ పద్ధతి ఉపయోగిస్తారు. ఫలితంగా బ్యాట్‌ కు ఓ పాలిష్డ్ లుక్ వస్తుంది. 

7. హ్యాండిల్‌ ఫిట్టింగ్ (Handle Fitting):
బ్యాట్ హ్యాండిల్ లను బ్లేడ్‌లో సక్రమంగా అమర్చడానికి నాణ్యమైన వుడ్ గ్లూ వాడతారు. ఆ హ్యాండిల్ ను బ్యాట్ బ్లేడ్ కు ఇలా ఫిట్ చేస్తారు.

8. ఫినిషింగ్ (Finishing):  బ్యాట్ హ్యాండిల్ ను అతికించాక బ్యాట్‌ కు ఫినిషింగ్ ప్రక్రియలో భాగంగా ఆయిలింగ్ తో పాటు వానిష్‌లు అప్లై చేస్తారు. ఇది బ్యాట్‌ను తేమ నుండి సంరక్షించడానికి సహాయపడుతుంది. 

9. Quality Check: చివరగా బ్యాట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో సరిచూసుకుంటారు. బ్యాట్‌లను పరీక్షించి వాటి స్థాయి, బరువు, బ్లేడ్ వెడల్పు మొదలైన అంశాలను పరిలిస్తారు. 

10. డిస్ట్రిబ్యూషన్ (Distribution): చివరగా తయారైన కాశ్మీర్ విల్లో బ్యాట్‌లు రిటైల్ స్టోర్లకు, క్రికెట్ క్లబ్స్‌కు పంపబడతాయి.

ఈ విధంగా విల్లో చెట్టు ఎంపిక నుండచిచివరి తనిఖీ వరకు అనేక ప్రక్రియలు పూర్తి చేశాకే మనం చూస్తున్న ఈ కాశీర్ విల్లో బ్యాట్ తయారవుతుంది.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram