Joe Root Jersey Pics Viral | తడిసిన బట్టలను గ్రౌండ్ లో ఆరేసుకున్న జో రూట్ | ABP Desam

 ఎవడైనా బాగా ఆడితే క్రికెట్ లో లోకల్ స్లాంగ్ లో మనోడు ఉతికి ఆరేశాడు అంటారు. జనరల్ గా డామినేషన్ ప్రదర్శించాడు అనటానికి ఈ పదం వాడతారు. కానీ ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ నిజంగానే ఉతికి ఆరేశాడు పాకిస్థాన్ ని. అసలే మాత్రం స్పందన లేని ముల్తాన్ పిచ్ పై మొదటి టెస్టులో విరుచుకుపడిన జోరూట్, హ్యారీ బ్రూక్...చేవలేని పాకిస్తాన్ బౌలర్లను నిజంగానే ఉతికి ఆరేశారు. హ్యారీ బ్రూక్ 317పరుగులు చేసి...వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ముల్తాన్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన బ్యాటర్ గా నిలిచాడు. సెహ్వాగ్ 2004 లో ఈ ఫీట్ సాధిస్తే సరిగ్గా 20ఏళ్ల తర్వాత సెహ్వాగ్ స్కోరును బద్ధలు కొట్టాడు హ్యారీ బ్రూక్. ఇది టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్న జో రూట్ కి అయితే పాకిస్థాన్ పిచ్ లు పండుగలా మారాయి. ముల్తాన్ పిచ్ మీద మర్రిచెట్టులా వేళ్లను బలంగా పాతుకుని నిలబడిపోయాడు రూట్. 262పరుగులు చేశాడు. అంత ఎండలో ఉక్కపోతలో తట్టుకుని నిలబడి రెండు రోజులు ఆడిన తెల్లదొరలు నాలుగో వికెట్ కు రికార్డు స్థాయిలో 454 పరుగుల పార్టనర్ షిప్ కొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్ 7వికెట్ల నష్టానికి 823 పరుగులకు డిక్లేర్ చేసింది. అసలు ఈ శతాబ్దంలో అంటే 2000 తర్వాత ఓ టెస్టు ఇన్నింగ్స్ లో ఓ జట్టు 800 పరుగులు చేయటం ఇదే తొలిసారి. ఇంగ్లండ్ బ్యాటర్ల డామినెన్స్ ఎంతెలా సాగిందంటే డిక్లేర్ చేసిన తర్వాత డే ముగిసిన తర్వాత తన తడిసిపోయిన బట్టలను అలాగే బ్యాగ్ లో పెట్టుకోలేక జో రూట్ లో ఇలా గ్రౌండ్ లో ఆరేసుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola