Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

Continues below advertisement

వరల్డ్ కప్ కైవసం చేసుకోవాటనికి సౌతాఫ్రికా ఇక ఆఖరి 24 బాల్స్ లో 26 పరుగులు చేయాలి. చాలా ఈజీ టార్గెట్.  ఎందుకంటే క్రీజులో ప్రమాదకర క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఉన్నారు. హాఫ్ సెంచరీ ముందున్న క్లాసెన్ ను అడ్డుకోవాలంటే తన ట్రంప్ కార్డు బుమ్రా తప్ప మరో దారి లేదని భావించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. బౌలింగ్ కి దిగిన బుమ్రా రెండో బంతికి డబుల్ తీసిన క్లాసెన్ హాఫ్ సెంచరీ కొట్టేశాడు. కానీ ఆ ఓవర్ ముగిసే సరికి బుమ్రా ఇచ్చిన పరుగులు కేవలం నాలుగే.  తనదైన స్టైల్ ఫుల్ లెంగ్త్ యార్కర్లతో క్లాసెన్, మిల్లర్ కు అంతుచిక్కలేదు బుమ్రా ఫలితంగా సమీకరణం 18 బాల్స్ లో 22గా మారిపోయింది. చిరాకువచ్చిన క్లాసెన్ తర్వాత హార్దిక్ అవుట్ చేయటం సహా కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. మళ్లీ బౌలింగ్ కి వచ్చిన బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మార్కో జాన్సన్ ను అవుట్ చేశాడు. అంతే సమీకరణం టఫ్ గా మారిపోయింది. మిల్లర్ ఉన్నా సూర్య సంచలన క్యాచ్ తో వరల్డ్ కప్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. లాస్ట్  నాలుగు ఓవర్లలో రెండు ఓవర్లు వేసి కేవలం 6 పరుగులే ఇచ్చి ఓ వికెట్ కూడా తీసిన బుమ్రా మ్యాచ్ ను తిప్పేసిన విధానం ఇది. ఆల్మోస్ట్ సౌతాఫ్రికా చేతుల్లోకి వెళ్లిన మ్యాచ్ ను భారత్ చేతుల్లోకి లాగింది బుమ్రానే. ఈ ఫైనల్ మ్యాచ్ లోనే కాదు ఈ వరల్డ్ కప్ అంతా బుమ్రా బౌలింగ్ ఇలానే సాగింది. పరుగులు ఇవ్వటానికి అస్సలు ఇష్టం లేదన్నట్లు డాట్ బాల్స్ తో రెచ్చిపోయాడు. ఈ టోర్నమెంట్ లో బుమ్రా ఎకానమీ కేవలం 4.17పరుగులు...ఇది వన్డేల్లో కూడా అద్భుతమైన ఎకానమీ అలాంటిది ట్వంటీ ట్వంటీల్లో పైగా వరల్డ్ కప్ లాంటి బిగ్గెస్ట్ లీగ్ లో సాధించి చూపించాడు బుమ్రా. అందుకే టోర్నీలో 15వికెట్లు సాధించిన బుమ్రానే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. కొహ్లీ తర్వాత టీ20 వరల్డ్ కప్పు సీజన్ లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన రెండో భారత ఆటగాడిగానూ రికార్డుల్లోకి ఎక్కాడు జస్ ప్రీత్ బుమ్రా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram