Indian Women Lose to Australia in Worldcup: 6 వికెట్ల తేడాతో ఆసీస్ సునాయస విజయం| ABP Desam

Continues below advertisement

Womens World Cup లో Australia తో జరిగిన League Match లో భారత మహిళలు ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా... ఆరంభంలోనే భారత్ ను దెబ్బతీసింది. 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో Yasthika Bhatia తో జత కలిసిన Captain Mithali Raj 130 పరుగుల Partnership తో జట్టు Innings ని కాస్త గాడిన పెట్టింది. చివర్లో Harmanpreet Kaur, Pooja Vastrakar మెరుపులతో భారత్ 277 పరుగులు సాధించింది. ఛేజింగ్ ప్రారంభించిన ఆసీస్.. చాలా పాజిటివ్ గా బ్యాటింగ్ చేసింది. ఎక్కడా తడబడలేదు. 121 పరుగుల తొలి వికెట్ పార్టనర్ షిప్ నెలకొల్పారు. కెప్టెన్ Meg Lanning 97 పరుగులతో ఆకట్టుకోగా, Alyssa Healy, Rachel Haynes రాణించారు. మధ్యలో వర్షం అడ్డంకి వచ్చి మ్యాచ్ రీస్టార్ట్ అయ్యాక భారత బౌలర్లు పుంజుకున్నట్టే కనిపించారు. కాస్త Pressure పెట్టి మ్యాచ్ ను ఆఖరు దాకా తీసుకొచ్చారు. కానీ మరో 3 బంతులు ఉండగానే ఆసీస్ మ్యాచ్ కైవసం చేసుకుంది. Batting కు చాలా అనువుగా ఉన్న వికెట్ పై భారత్ కనీసం 30 పరుగులు అయినా తక్కువ చేయడం వల్లే మ్యాచ్ ను గెలుచుకోలేకపోయిందని స్పష్టమవుతోంది. ఈ మ్యాచ్ తర్వాత 4 పాయింట్లతో భారత్ నాలుగో స్థానంలో ఉంది. Bangladesh, South Africa తో జరగబోయే తర్వాతి మ్యాచ్ లను గెలిస్తే Semifinals అవకాశాలు మెరుగవుతాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram