Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

Continues below advertisement

 న్యూజిలాండ్ తో ఈనెల 11 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ కు  15మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 2027 వరల్డ్ కప్ జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న ప్రధాన ఆటగాళ్లకే సెలక్షన్ కమిటీ ఛాన్స్ ఇచ్చింది. అయితే రెండు మూడు షాక్స్ ఉన్నాయి ఈ టీమ్ లో. ప్రిన్స్ శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో కివీస్ తో తలపడనున్న జట్టులో మళ్లీ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అయితే ఈ సిరీస్ తో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా మళ్లీ పునరాగమనం చేయనున్నాడు. బట్ అయ్యర్ పేరు ప్రకటించిన సెలెక్షన్ కమిటీ..అతను ఇంకా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్ నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోలేదని చెప్పింది. ఒకవేళ అయ్యర్ ఫిట్ నెస్ సాధించకపోతే అయ్యర్ ఆడే అవకాశం లేదు. మరో షాక్ ఏంటంటే హార్దిక్ పాండ్యాకు మ్యాచ్ లో 10 ఓవర్లు బౌలింగ్ వేయగలిగే ఫిట్ నెస్ లేదంటూ సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ చెప్పటంతో రానున్న టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద పాండ్యా ను కివీస్ తో వన్డే సిరీస్ కు పక్కన పెట్టింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఈ సిరీస్ కైనా పేరు ఉంటుందని ఎక్సెప్ట్స్ చేస్తున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మళ్లీ మొండి చెయ్యే ఎదురు కాగా...గంభీర్ గారాల పట్టి హర్షిత్ రానా కు ఛాన్స్ మాత్రం దక్కింది. కేఎల్ రాహుల్ మెయిన్ వికెట్ కీపర్ గా, రిషబ్ పంత్ బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యారు. రోహిత్ తో కలిసి గిల్ లేదా జైశ్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. కోహ్లీ వన్ డౌన్ లో ఆడతాడు. జైశ్వాల్ ఓపెనింగ్ దిగితే గిల్ టూ డౌన్ లో ఆడే ఛాన్స్ ఉంది. అయ్యర్ అందుబాటులో లేకపోతే రాహుల్, పంత్ ఇద్దరికీ ఛాన్స్ దక్కినా ఆశ్చర్యం లేదు. ఇక మహ్మద్ సిరాజ్ మళ్లీ జట్టులోకి రావటంతో అర్ష్ దీప్, సిరాజ్, హర్షిత్ రానా పేస్ బాధ్యతలను జడ్డూ, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ కోసం ఎంపికయ్యారు. పాండ్యా బదులుగా ఆల్ రౌండర్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola