India vs Ireland Match Highlights | ఐర్లాండ్ పై 8వికెట్ల తేడాతో భారత్ విక్టరీ | T20 World Cup 2024
Download ABP Live App and Watch All Latest Videos
View In App టీ 20 వరల్డ్ కప్ లో తొలి లీగ్ మ్యాచ్ ను విజయంతో ప్రారంభించింది టీమిండియా. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్వల్ప లక్ష్య చేధనను సునాయాసంగా చేధించిన టీమిండియా వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. న్యూయార్క్ లోని నాసౌ కౌంటీ స్టేడియంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయం కరెక్ట్ అని తేల్చేలా అర్ష్ దీప్ సింగ్ ఇనీషియల్ ఓవర్స్ లోనే ఐర్లాండ్ ను ఇబ్బంది పెట్టాడు. ఓపెనర్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తో పాటు మరో ఓపెనర్ బాల్ బిర్నే ఇద్దరి వికెట్లూ అర్ష్ దీపే తీసుకున్నాడు. దీంతో ఐర్లాండ్ 9పరుగులకే 2వికెట్లు కోల్పోయింది. అర్ష్ దీప్ కు తోడుగా హార్దిక్ పాండ్యా తనదైన స్లో పేస్ బౌలింగ్ తో ఐర్లాండ్ బ్యాటర్లను ఆడుకున్నాడు. ఐపీఎల్ ఫామ్ లేమిని అధిగమిస్తూ వికెట్ కీపర్ టకర్, కర్టిస్ కాంఫర్, మార్క్ అడైర్ లను అవుట్ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లలో 27పరుగులు మాత్రమే ఇచ్చి 3వికెట్లు తీయటం ద్వారా తానెంత విలువైన ఆల్ రౌండర్ నో ప్రూవ్ చేసుకున్నాడు.