India vs Australia ODI World Cup | నిరాశపరిచిన భారత్ | ABP Desam
వన్ డే వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా అమ్మాయిలు నిరాశ పరిచారు. ఆస్ట్రేలియాతో చిత్తుగా ఓడిపొయ్యారు. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచ్ తో మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద రన్ ఛేజ్ గా రికార్డు నమోదు చేసింది ఆస్ట్రేలియా.
టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదట్లో వికెట్స్ తీయడానికి కాస్త కష్టపడింది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతికా రావల్ అద్భుతంగా రాణించారు. ఇద్దరు కలిసి 25 ఓవర్లలో 155 పరుగులు జోడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా, హర్లీన్ డియోల్ పెద్దగా స్కోరు చేయలేదు. 48.5 ఓవర్లలో 330 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది.
331 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.... సాధ్యం కాదనుకున్న స్కోర్ ను చేజ్ చేసి చూపించింది. కెప్టెన్ అలిస్సా హీలీ ... ఫోబ్ లిచ్‌ఫీల్డ్ తో కలిసి శుభారంభం ఇచ్చింది. అలిస్సా హీలీ కేవలం 84 బంతుల్లో సెంచరీని పూర్తి చేసింది. అయితే మ్యాచ్ మధ్యలో వరుస వికెట్లు కోల్పోతూ ఆసీస్ కష్టాలో పడిపోయింది. అమన్‌జోత్ కౌర్.. 38 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు పడగొట్టింది. కానీ కిమ్ గార్త్ అద్భుతంగా ఆది టీమ్ ను గెలిపించింది. 49వ ఓవర్ లో పెర్రీ సిక్స్ కొట్టి ఆస్ట్రేలియాను గెలిపించింది.