India vs Australia Final : World Cup 2023 లో నేడు భారత్ ఆసీస్ అమీతుమీ | ABP Desam
ఎందుకీ క్రికెట్ కి ఇంత క్రేజ్. తెలియదు. ఆటగాళ్లకు డెమీ గాడ్ స్టేటస్ ఎందుకు తెలియదు. ప్రపంచకప్ లో భారత్ గెలవాలని ఇన్ని కోట్ల మంది కోరుకోవటం ఎందుకు తెలియదు. ఇక్కడ పుట్టుకతోనే ప్రతీ వాడికి ఓ మతం ఉంటుంది. అది వాడి పర్సనల్. కానీ వీటికి అతీతంగా ఓ మతం అందరికీ ఆపాదించబడుతుంది. దాని పేరే క్రికెట్.