India Strategies For World Cup 2023: ఫ్యాన్స్ నుంచి టీమిండియాకు ప్రత్యేక విన్నపం
'ట్రెండ్ ఫాలో అవను. ట్రెండ్ సెట్ చేస్తా' అని ఎప్పుడైతే గబ్బర్ సింగ్ చెప్పాడో అప్పట్నుంచి ఫాలో అవడం కన్నా సెట్ చేయడమే గొప్ప అన్నట్టుగా చాలా మంది ఫిక్స్ అయిపోయారు. దాన్ని క్రికెట్ సహా అన్ని రంగాలకూ అప్లయ్ చేసేశారు. కానీ మరో 23 రోజుల్లో ప్రపంచకప్ ఉన్న దృష్ట్యా మన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మిగతా ఆటగాళ్లందరికీ ఫ్యాన్స్ నుంచి ఒక విన్నపం. ఈ ఒక్కసారి మాత్రం ట్రెండ్ సెట్ చేయకుండా ఫాలో అయిపోతేనే బెటర్ అని.