India Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP Desam

Continues below advertisement

 స్ట్రాటజీ...క్రికెట్ ప్రాణం ఈ మాట. జెంటిల్మన్ గేమ్ అని పిలుచుకునే క్రికెట్ లో ఆన్ ఫీల్డ్, అవుట్ ఫీల్డ్ స్ట్రాటజీలు చరిత్రలో మనకు ఎన్నో మరుపురాని విజయాలను ఇచ్చాయి. అలాంటిది మన కొత్త కోచ్ గంభీర్ సార్ గారు వచ్చిన తర్వాత ఈ స్ట్రాటజీలను, ఆత్మవిశ్వాసాన్ని అతివిశ్వాసం, బలుపు రీప్లేస్ చేసుకుంది అని చెప్పాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఇంగ్లండ్ తీసుకువచ్చిన బజ్ బాల్ దూకుడును మనం ఆపాదించుకుందా అని బొక్కబోర్లా పడ్డాం. సిచ్యుయేషన్ తో సంబంధం లేకుండా అప్లై చేసిన గంభాల్ కు దరిద్రం అతుక్కుని బూమరాంగ్ లా మన మొఖానే పెడాల్మని తిరిగొచ్చి తగిలింది. ఇది న్యూజిలాండ్ తో 3-0 తేడాతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఘోర పరాజయాన్ని చవిచూశామని చెప్పటం లేదు. ముందే తీసుకున్న నిర్ణయాలు అనేకం మనల్ని దారుణంగా దెబ్బతీశాయి. టీమిండియాలో అతెందుకు ఉపఖండంలో ఏ దేశంలోని పిచ్ లైనా సంప్రదాయ స్పిన్ పిచ్ లు. అనిల్ కుంబ్లే, ముత్తయ్య మురళీధరన్, అశ్విన్ లాంటి లెజెండ్స్ పుట్టారు ఈ ఉపఖండపు పిచ్ ల మీద. అలాంటిది వీటన్నింటిని పేస్ పిచ్ లు మార్చేయాలని ప్లాన్ చేస్తే...అదే చేశాడు గంభీర్.  బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ లో పేస్ పిచ్ ను సిద్ధం చేశారు. అంతే స్పిన్ పిచ్ లను ఊహించుుకని వచ్చిన మ్యాట్ హెన్రీ, ఓ రూర్కీ లాంటి బౌలర్లు పండుగ చేసుకున్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 46పరుగులకే కుప్పకూలిపోయిన ఘటనను చూశాం. సెకండ్ ఇన్నింగ్స్ లో పంత్ పోరాటంతో కాస్త అది మర్చిపోయాం. సరే రెండో టెస్టులోనైనా లోపాలన్ని సరి చేసుకున్నామా అంటే లేదు. పరిస్థితులకు సంబంధం లేకుండా అదే దూకుడు. క్రీజు వదిలి వచ్చేయటాలు..అర్జెంట్ గా పని ఉన్నట్లు సింగిల్స్ కి ట్రై చేసి రనౌట్లు అవ్వటాలు..ఎన్నో తప్పిదాలు చేశాం మనం. ఫలితంగా కివీస్ స్పిన్నర్లు చెలరేగిపోయారు. రెండో టెస్టులో మిచెల్ శాంట్నర్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి 13వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా పుష్కరం కాలం తర్వాత భారత్ స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. పోనీ మూడు టెస్టుకు పాఠం నేర్చుకున్నామా అంటే లేదు. కనీసం ఈ మ్యాచ్ గెలిచి పరువు దక్కించుకుంటారంటే ఈసారి అజాజ్ పటేల్ ప్రతాపం చూపించాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 11 వికెట్లు తీసి భారత్ కు 92ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో చూడని ఓటమిని రుచి చూపించాడు. మొత్తం మీద స్ట్రాటజీలు వర్కవుట్ చేయాల్సిన కోచ్ గంభీర్ ఎప్పట్లానే ఎక్స్ ప్రెషన్ లెస్ ఫేస్ తో డ్రెస్సింగ్ రూమ్ లో అలా కూర్చుని ఉంటే మనోళ్లు సర్వం సమర్పయామి అన్నట్లు ఎక్కడా లేని రికార్డును న్యూజిలాండ్ కి కట్టబెట్టి ఆసీస్ తో కంగారు పిచ్ ల మీద ఆడాల్సిన సిరీస్ కు ముందు బిక్క మొఖం వేసుకోవాల్సి వచ్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram