Ind vs Zim T20 WC 2022 Highlights: జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం | ABP Desam
టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశను టీమిండియా భారీ విజయంతో ముగించింది. ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 71 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 71 పరుగులతో విజయం సాధించింది. గ్రూప్-2లో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో నవంబర్ 10వ తేదీన జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.