Ind vs WI Test Series | వెస్టిండీస్ ను ఫామ్ లో లేదని తక్కువ అంచనా వేయొద్దు | ABP Desam

క్రికెట్లో ఓ సామెతుంది. మోస్ట్ ఈజీయెస్ట్ క్యాచెస్ ఆర్ ది మోస్ట్ టఫెస్ట్ వన్స్.. అని. సేమ్ ఇప్పుడు విండీస్‌తో సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ పరిస్థితి అలాగే ఉంది. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఇంగ్లండ్‌ లాంటి స్ట్రాంగ్ టీమ్‌కి టఫ్ ఫైట్ ఇచ్చి ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో డ్రా చేసుకుని తిరిగొచ్చాడు. ఇక్కడ ఆసియా కప్‌లో కెప్టెన్ కాకపోవడంతో ప్రశాంతంగా ఆడుకుని సైలెంట్‌గా సైడ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు మళ్లీ గిల్‌కి వెస్ట్ ఇండీస్ రూపంలో పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. నేపాల్ చేతిలో అతి దారుణంగా చావు దెబ్బ తిని ఓడిన విండీస్ జట్టు ఆ టీమ్ చరిత్రలోనే అతి దారుణమైన ఫేజ్‌లో ఉంది. అలాంటి టీమ్‌పై ఇండియా అండర్ 19 టీమ్ కూడా గెలిచేస్తుందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఆల్రెడీ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి టైంలో.. గిల్ తన కెప్టెన్సీతో 2 టెస్టుల్లోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చాలా ఈజీగా గెలవాల్సి ఉంటుందని.. అలా కాకుండా.. ఏ మాత్రం తప్పుడు డెసిషన్స్ తీసుకున్నా.. విండీస్‌ని ఎదుర్కోవడంలో ఏ మాత్రం తడబాటు ప్రదర్శించినా.. ప్రతి ఒక్కరి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి.. ఫామ్‌లో లేదు కాబట్టి.. విండీస్‌ని లైట్ తీసుకోవాలనే ఆలోచన ఏ మాత్రం మైండ్‌లోకి రానివ్వకుండా ఎదురుగా ఉన్నది కూడా టఫ్ టీమే.. అనే ఆలోచనతో 2 మ్యాచ్‌లు కంప్లీట్ చేయాలి. అలాగే ఫుల్ డామినెన్స్‌తో విండీస్‌ని ఓడించాలి.
అప్పుడే ఈ సిరీస్‌లో గిల్‌కి ఫుల్ మార్క్స్ పడేది. అంటే ఈ సిరీస్ టీమిండియా ఆడుతున్నా.. అసలు టెస్ట్ మాత్రం కెప్టెన్ గిల్‌కే అన్నమాట.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola