Ind vs SA 3rd ODI Highlights: మూడో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్
సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. 2018 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఘన విజయంతో భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్ దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్... సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. తిలక్ వర్మ కూడా అర్ధ శతకంతో సత్తా చాటడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 78 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి... వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.