Ind vs Pak ICC ODI WC 2025 | అక్టోబర్ 5న ఇండియా, పాక్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ | ABP Desam
ఆసియాకప్‌లో టీమిండియా మెన్స్ టీమ్ పాకిస్తాన్‌ని మూడుసార్లు చిత్తుగా ఓడించి.. ఫైనల్లో విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు వంతు విమెన్స్ టీమ్‌కొచ్చింది. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో భాగంగా అక్టోబర్ 25న పాకిస్తాన్‌తో ఇండియన్ విమెన్స్ టీమ్ తలపడబోతోంది. ఆల్రెడీ వన్డేల్లో పాకిస్తాన్‌పై మన అమ్మాయిలకి తిరుగులేని రికార్డ్ ఉంది. ఇప్పటికవరకు రెండు టీమ్స్ 11 వన్డే మ్యాచ్‌ల్లో తలపడితే.. అన్ని మ్యాచ్‌లు టీమిండియానే గెలిచి పూర్తి డామినేటింగ్ పొజిషన్లో ఉంది. అంటే.. ఇండియాపై పాక్ జట్టుకి కనీసం ఒక్క వన్డే గెలుపు కూడా లేదన్నమాట. ఆసియా కప్‌లో ఆల్రెడీ స్కై సేన పాక్‌ని మట్టికరిపించింది కాబట్టి.. ఇప్పుడు ఆ బాధ్యత అమ్మాయిల చేతికొచ్చింది. ఇక రీసెంట్‌గా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా హర్మన్ టీమ్ అదరగొట్టింది. ముఖ్యంగా స్మృతి మంధాన రికార్డ్ సెంచరీలతో రెచ్చిపోయింది. స్మృతి ఫుల్ ఫామ్‌లో ఉండటంతో.. పాక్‌తో మ్యాచ్‌లో కూడా మంధాన రెచ్చిపోయి ఆడే ఛాన్స్ ఉంది. అలాగే వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్ డియోల్, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టారు. ఇంకోవైపు భారత్‌తో మ్యాచ్‌తోనే టోర్నీ మొదలుపెట్టబోతున్న పాక్ టీమ్.. రీసెంట్‌గా సౌతాఫ్రికా, ఇర్లాండ్స్‌తో జరిగిన టోర్నీల్లో చిత్తుగా ఓడి సిరీస్‌లు కూడా పోగొట్టుకుంది. ఈ లెక్కన చూస్తే.. కొలంబో వేదికగా అక్టోబర్ 5న జరగబోతున్న మ్యాచ్‌లో కూడా పాక్ టీమ్‌ని టీమిండియా విమెన్స్ టీమ్ మట్టికరిపించేలానే కనిపిస్తోంది.