Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
ప్లేస్ లు మారుతున్నాయి...జట్లు మారుతున్నాయి. కానీ కింగ్ విరాట్ కోహ్లీ దూకుడులో ఎక్కడా తగ్గటమనదే కనపడటం లేదు. నిన్న కూడా అంతే. వడోదరలో న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేను భారత్ 4 వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది టీమిండియా. ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోలస్ ధాటిగా ఆడటంతో ఓపెనింగ్ పార్టనర్ షిప్పే 117పరుగులు పెట్టింది న్యూజిలాండ్. డెవాన్ కాన్వే 56 పరుగులు, హెన్రీ 62పరుగులు చేశారు. ఇక టూ డౌన్ లో వచ్చిన డేరిల్ మిచెల్ 84పరుగులు బాదటంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8వికెట్లు నష్టపోయి ఎగ్జాట్ గా 300పరుగులు చేసింది. సిరాజ్ మియా, హర్షిత్ రానా, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు. ఇక 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ స్టార్టింగ్ లోనే రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. హిట్ మ్యాన్ 26పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక తర్వాత వచ్చిన కోహ్లీ...ప్రిన్స్ శుభ్ మన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ను స్టేబుల్ గా ముందుకు తీసుకువెళ్లాడు. గిల్ టైమ్ తీసుకుని మరీ 56పరుగులు చేస్తే...నాలుగు నెలల ఇంజ్యూరీ తర్వాత కోలుకుని వచ్చిన అయ్యర్ 49పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. ఇక కింగ్ విరాట్ ఇన్నింగ్స్ ను ఒంటి చేత్తో మోశాడు. 91 బాల్స్ లో 93 పరుగులు చేసి జేమిసన్ బౌలింగ్ లో ఔటైపోయాడు విరాట్. ఇక మిగిలిన పనిని రాహుల్, హర్షిత్ రానా కలిసి పూర్తి చేశారు. ఫలితంగా భారత్ 49 ఓవర్లలోనే 6 వికెట్లు నష్టపోయి టార్గెట్ ను ఛేజ్ చేసేసింది. కైల్ జేమిసన్ 4వికెట్లు తీసినా భారత్ విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.