Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో టీమిండియాను ( India vs New Zealand ) ఓడించింది. వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది న్యూజిలాండ్. భారత్‌లో పర్యటించి వన్డే సిరీస్‌లో ఇండియాను న్యూజీలాండ్ ను ఓడించడం ఇదే మొదటిసారి.
తొలి వన్డేలో భారత్ నెగ్గగా, రెండో వన్డేలో కివీస్ నెగ్గి సిరీస్ సమం చేసింది. ఇక డిసైడింగ్ మ్యాచ్ అయిన మూడవ వన్డే లో కివీస్ మొదట బ్యాటింగ్ చేసి 337 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా 296 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సెంచరీ చేసి టీమ్ ను విజయపు అంచులకు తీసుకెళ్లాడు. కానీ విరాట్ సెంచరీ వృధా అయింది.
న్యూజిలాండ్ 1988 నుంచి భారత్‌లో సిరీస్‌లు ఆడుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తలపడిన కివీస్ వరుసగా ఏడుసార్లు ఓడిపోతూనే వస్తోంది. ఈ సంవత్సరం సొంతగడ్డపై భారత్ ను ఓడించి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది న్యూజీలాండ్ యంగ్ టీమ్. గతంలో టెస్టు సిరీస్ ను ఓడిపోయిన భారత్, ఈ ఏడాది వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది.