Ind vs Ban 1st ODI Highlights: అద్భుతమైన పోరాటంతో బంగ్లాదేశ్ కు మరపురాని విజయాన్ని అందించిన మెహదీ
భారత క్రికెట్ జట్టు అభిమానులకు మరో షాక్. బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బంగ్లాదేశ్ 46 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక్కడ అన్నిటి కంటే బాధాకరమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. కానీ టెయిలెండర్లు మెహదీ హసన్ మిరాజ్ (38 నాటౌట్: 39 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (10 నాటౌట్: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) చివరి వికెట్‌కు 41 బంతుల్లోనే అజేయంగా 51 పరుగులు జోడించి బంగ్లాదేశ్‌ను గెలిపించారు.