Ind Lost First Test By Innings vs SA: చరిత్ర సృష్టించాలనుకున్నారు, చతికిలపడ్డారు..!
సౌతాఫ్రికా గడ్డ మీద టెస్ట్ సిరీస్ ఈసారైనా గెలవాలని కోటి ఆశలతో బరిలోకి దిగిన భారత్, దాని కోసం మరికొన్నేళ్లు ఆగక తప్పదు. రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో, సౌతాఫ్రికా చేతిలో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.కేవలం 3 రోజుల్లోనే మ్యాచ్ ను సమర్పించేసుకుని పరాభవం మూటగట్టుకుంది.