Cricket in LA Olympics 2028 | ఒలింపిక్స్‌లోకి క్రికెట్

128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడనున్నారు. 2028 ఒలింపిక్స్‌ అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో జరగనుంది. ఈ ఒలింపిక్స్‌లో జరిగే క్రికెట్‌ షెడ్యూల్‌ రిలీజ్ అయింది. మ్యాచ్‌ ప్రారంభానికి మూడేళ్ల ముందుగానే షెడ్యూల్ ను ప్రకటించారు. 2028లో ఒలింపిక్స్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందు.. జులై 12న ప్రారంభమై జులై 29న ముగియనున్నాయి. ఈ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. మెన్, విమెన్ విభాగాల్లో మొత్తం 6 ఇంటర్నేషనల్ టీమ్స్ ఒలింపిక్స్‌లో పోటీ పడతాయి. స్వర్ణం, రజతం, కాంస్య పతకాల కోసం ఈ టీమ్స్ పోటీ పడనున్నాయి.

1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఒక్కసారి మాత్రమే ఆడారు. అప్పుడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్‌కు చెందిన రెండు జట్లు తలపడ్డాయి. ఆ గేమ్ లో గ్రేట్ బ్రిటన్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు క్రికెట్ మళ్ళి ఒలింపిక్స్ లోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ LA28 కోసం క్రికెట్‌తో సహా మరో ఐదు కొత్త గేమ్స్ ను కూడా ఎంపిక చేసింది. వీటిలో బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్ ఉన్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola