Harshit Rana out Siraj In T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ కు హర్షిత్ దూరం..సిరాజ్ కి ఎంట్రీ | ABP Desam
గడచిన ఏడాదిన్నర రెండేళ్లుగా భారత్ క్రికెట్ చూస్తున్న ఎవరికైనా సరే ఓ క్లారిటీ ఉండే విషయం ఏంటంటే..టీమిండియాకు ఆడే త్రీ ఫార్మాట్ ప్లేయర్లు ఎంత మంది అంటే...కేవలం ముగ్గురే ఒకరు బుమ్రా..మరొకరు గిల్...మూడో హర్షిత్ రానా. మొదటి ఇద్దరు టాలెంటెడ్ ఓకే...మూడో వ్యక్తి ఎలా త్రీ ఫార్మాట్ ప్లేయర్ అంటే అది కోచ్ గంభీర్ గారిని అడగాల్సిందే. ఎందుకంటే హర్షిత్ రానాను కోల్ కతా నైట్ రైడర్స్ టైమ్ నుంచి ప్రమోట్ చేస్తూ వస్తోంది గంభీరే కాబట్టి. అందుకే హర్షిత్ రానాను గంభీర్ కి దత్తపుత్రుడు అని పిలస్తుంటారు అంతా. అలాంటి దత్తపుత్రుడు టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ కి కూడా సెలెక్ట్ అయ్యాడు. అయితే బ్యాడ్ లక్ ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా హర్షిత్ రానాకు గాయమైంది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో మోకాలికి గాయం కావటంతో వైద్యులు హర్షిత్ రానాకు నాలుగు వారాల రెస్ట్ అవసరమని చెప్పారు. డాక్టర్, ఫిట్ నెస్ సర్టిఫికేట్స్ లేకపోవటంతో హర్షిత్ రానా టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోక తప్పలేదు. తన స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో బుమ్రా కూడా ఆడే అవకాశం లేదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి బుమ్రాకు మొదటి మ్యాచ్ లో ఫిట్నెస్ NOC రాకపోవటంతో యూఎస్ తో మ్యాచ్ లో అర్ష్ దీప్, సిరాజ్ పేస్ బౌలింగ్ భారాన్ని పంచుకోనున్నారు. హార్దిక్ పాండ్యా వీళ్లకు సపోర్ట్ ఉంటాడు.






















