Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టుని దేశం మొత్తం ఆకాశానికెత్తేస్తోంది. భారత్ గర్వపడేలా చేశారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి టైంలో చిరస్మరణీయ విజయాన్ని చిరకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వరల్డ్ కప్ టాటూలను వేయించుకున్నారు. అయితే ముందుగా కెప్టెన్ హర్మన్.. తన లెఫ్ట్ హ్యాండ్ బైసెప్‌పై వరల్డ్ కప్ టాటూను వేయించుకుంటే.. తర్వాత స్మృతి కూడా తన కుడి చేతి మణికట్టుపై వరల్డ్ కప్ టాటూను వేయించుకుంది. ఇద్దరూ ఈ ఫోటోలని ఇన్‌స్టాలో షేర్ చేయడమే కాకుండా.. ఈ విజయం తనకి చిరకాలం గుర్తుండిపోతుందని హర్మన్ రాసుకొస్తే.. ఇది ప్రౌడ్ మూమెంట్ అంటూ స్మృతి రాసుకొచ్చింది. ఇప్పుడీ టాటూ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత కూడా అనూహ్యంగా కంబ్యాక్ ఇచ్చి లీగ్ స్టేజ్‌లో న్యూజిల్యాండ్‌ని, సెమీస్‌లో పటిష్ఠ ఆస్ట్రేలియాని ఓడించడమే కాకుండా.. ఫైనల్లో సౌతాఫ్రికా లాంటి స్ట్రాంగెస్ట్ టీమ్‌ని ఓడించి 51 ఏళ్లుగా కలగానే మిగిలిపోయిన వరల్డ్ కప్ కలని నిజం చేసింది హర్మన్ సేన. అందుకే ఈ విజయం భారత మహిళా జట్టుకు అంత ఇంపార్టెంట్.