Harman Preet Kaur | వన్డే వరల్డ్ కప్ 2025లో హర్మన్ కెప్టెన్సీ, ఫామ్‌పై పెరుగుతున్న విమర్శలు | ABP Desam
విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో వరుసగా రెండో ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో దిగజారిన టీమిండియాపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ, బ్యాటింగ్ ఫామ్‌పై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. హర్మన్ దండగ కెప్టెన్ అనీ, అటు బ్యాటింగ్ చేయడం రాకపోగా.. ఇటు కెప్టెన్సీలో కూడా ఫెయిల్ అవుతుండడం దారుణమంటూ రెచ్చిపోతున్నారు. దీనికి కారణం.. రీసెంట్‌గా వన్డే వరల్డ్ కప్‌లో... ముందు సౌతాఫ్రికా చేతిలో.. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం.. అండ్ ఈ వరుస ఓటముల వల్ల టోర్నీలో ఇండియా సెమీఫైనల్ ఆశలు దెబ్బతినడమే. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సెమీస్ చేరాలంటే ఇకపై ఆడబోయే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. అంటే నెక్ట్స్ ఆడబోయే ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, బంగ్లాదేశ్ మూడింటిపై గెలిస్తేనే సెమీస్ చేరేది. దీంతో ఈ ఓటములకి హర్మన్ ప్రీత్ కౌర్ చెత్త కెప్టెన్సీతో పాటు.. పేలవ బ్యాటింగే కారణమంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్‌గా ఆసీస్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌తో పాటు ఇప్పుడు వరల్డ్ కప్‌లో కూడా హర్మన్ పరమ చెత్తగా ఆడుతోందని, ఆమెని వెంటనే కెప్టెన్సీ నుంచి టీమ్ నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిజంగానే 2023 నుంచి వన్డేల్లో హర్మన్ పెర్ఫార్మెన్స్ పడిపోతూ వచ్చింది. 2023లో వన్డేల్లో 39 యావరేజ్‌తో 3 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క సెంచరీ చేసిన హర్మన్.. ఆ తర్వాత.. 2024లో మరీ దారుణంగా 6 మ్యాచ్‌ల్లో 25 యావరేజ్‌తో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసి పరమ దారుణంగా ఆడింది. అప్పటి నుంచే ఆమెపై విమర్శలు స్టార్ట్ అయ్యాయి. అయితే 2025లో మళ్లీ కొంచెం ఫామ్‌లోకొచ్చి.. 12 ఇన్నింగ్స్‌లో 33 యావరేజ్‌తో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు బాది పర్వాలేదనిపించుకుంది. కానీ రీసెంట్ ఆస్ట్రేలియా సిరీస్‌లో 11, 17, 52 రన్స్‌తో మళ్లీ విమర్శల పాలైంది. ఇక ఇప్పుడు వరల్డ్ కప్‌లో అయితే ఆడిన 4 మ్యాచ్‌ల్లో హర్మన్ చేసింది 71 రన్స్ మాత్రమే. శ్రీలంకపై 21, పాకిస్తాన్‌పై 19, సౌతాఫ్రికాపై 9, ఆస్ట్రేలియాపై 22 రన్స్ మాత్రమే చేసింది. ఇక సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓడిపోవంతో ఆమె కెప్టెన్సీపై కూడా విమర్శలు స్టార్ట్ అయ్యాయి. మరి ఈ విమర్శలన్నింటికీ హర్మన్ తన ఆటతో, కెప్టెన్సీతో ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.