Hardik Pandya No Look Shot Wins Internet | అదిరిపోయే షాట్ కొట్టిన పాండ్యా | ABP Desam

హార్దిక్ పాండ్యాని ఆల్‌రౌండర్ ఎందుకంటారో తెలుసా..? అతను ఆల్‌రౌండర్ కాబట్టి. ఓ పొలిటికల్ లీడర్‌ మాటల్లా ఫన్నీగా అనిపించినా...నవ్వకండి..ఇది సీరియస్ మ్యాటర్ అని అంతా ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఎందుకంటే..పాండ్యా క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది మరి. బంగ్లాతో జరిగిన తొలి T20 మ్యాచ్‌లో బౌండరీలతో హోరెత్తించాడు హార్దిక్ పాండ్యా. 128 పరుగుల లక్ష్యాన్ని ఎంతో అవలీలగా దాటేశాడు. కేవలం 16 బాల్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సులు బాది 39 రన్స్ చేశాడు. ఇదంతా ఒక ఎత్తైతే...ఆ ఒక్క షాట్ మరో ఎత్తు. బంగ్లా బౌలర్ తక్సీన్ అహ్మద్ బౌలింగ్‌లో వరుస పెట్టి మూడు ఫోర్లు కొట్టాడు. వాటిలో ఓ షాట్ మాత్రం పాండ్యా స్వాగ్‌ని చూపించింది. కనీసం బాల్ వైపు చూడకుండానే జస్ట్ బ్యాట్‌తో టచ్ చేశాడు. కీపర్ మీదుగా ఆ బాల్‌ బౌండరీ వైపు పరుగులు పెట్టింది. ఆ షాట్ కొట్టిన తరవాత కూడా ఏమీ తెలియనట్టుగా సింపుల్‌గా రియాక్ట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. ఇలాంటి మొమెంట్స్ దొరికితే క్రికెట్ ఫ్యాన్స్ ఊరుకుంటారా. సోషల్ మీడియాలో ఈ వీడియోని, ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola