Hardik Pandya Journey with Girl Friend | శ్రీలంకలో భారత్ కు అదిరిపోయే స్వాగతం | ABP Desam
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకలో జరగబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శివరాత్రి రోజు నైట్ జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా కొలంబో ఎయిర్ పోర్ట్ లో ల్యాండైపోయింది. శ్రీలంక బౌద్ధ, హైందవ సంప్రదాయ నృత్యాలతో భారత ప్లేయర్లకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ మొదలు...టీమిండియా ప్లేయర్స్ అంతా ఆ వెల్కమ్ ను భలే ఎంజాయ్ చేశారు. అర్ష్ దీప్ సింగ్ తను కూడా వాళ్లతో పాటు డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. తిలక్ వర్మ ఆ వెల్కమ్ ని రీల్ తీసుకున్నాడు. ఇక్కడి వరకూ అందరి దృష్టి ఓ జంటపై పడింది. ఎస్ హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహీకా శర్మతో కలిసి కనిపించాడు. వాస్తవానికి టీమిండియా ప్లేయర్లు ఇప్పుడు బయో బబుల్ లో ఉన్నారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా గర్ల్ ఫ్రెండ్స్ కానీ ప్లేయర్లతో ఉండటానికి వీలు లేదు. కానీ పాండ్యా ఇంత ధైర్యంగా గర్ల్ ఫ్రెండ్ తో కలిసే తిరుగుతుండటం ఇప్పుడు చర్చకు దారితీసింది. వాస్తవానికి ఫిబ్రవరి 10న భారత ప్లేయర్లు తమ ఫ్యామిలీస్ ని కూడా తమతో కలిసి ఉండటానికి వరల్డ్ కప్ లో ఎలో చేయాలని రిక్వెస్ట్ పెట్టుకుంది. దాన్ని బీసీసీఐ రిజెక్ట్ చేసింది. గేమ్ మీద కాన్సట్రేట్ చేయాలని క్లాస్ పీకింది. కానీ ఫిబ్రవరి 13న పాండ్యానే బీసీసీఐ రూల్ బ్రేక్ చేసి కనిపించాడు. ఎయిర్ పోర్ట్ బయట గర్ల్ ఫ్రెండ్ ను వేరే కార్ లో ఎక్కిస్తున్నట్లు కనిపించినా...ఫ్లైట్ జర్నీ చేయటానికి...ఎయిర్ పోర్ట్ రావటానికి ముందు..హోటల్ రూమ్ లోనూ ఇద్దరూ కలిసే కనిపించారు. సో పాండ్యా వాంటెడ్ లీ రూల్ బ్రేక్ చేస్తున్నాడా.. వాలైంటెన్స్ డే కాబట్టి బీసీసీఐని లైట్ తీసుకుని గర్ల్ ఫ్రెండ్ తో టైమ్ స్పెండ్ చేస్తున్నాడా చూడాలి..ఇది కాంట్రవర్సీ కాకముందే పాండ్యా పాకిస్తాన్ మీద తన మెంటల్ మాస్ ఆట చూపిస్తే చాలు..అన్ని వివాదాలు సైడ్ కి పోతాయ్.























