Hardik Pandya Emotional After T20 World Cup Win | టీమిండియాను విశ్వవిజేతగా నిలిపి ఎమోషనలైన పాండ్యా
సరిగ్గా నెలరోజుల క్రితం దేశమంతా పాండ్యా గురించే చర్చ. తన భార్య తనను వదిలేసింది అని. విడాకుల కోసం భారీగా డబ్బు అడుగుతోంది అని. అంతకు ముందు నెల రోజుల ముందు పాండ్యా గురించే చర్చ. ఐపీఎల్ లో దారుణమైన ప్రదర్శన చేస్తున్నాడని. గుజరాత్ నుంచి ముంబైకి వచ్చి కెప్టెన్ అయ్యిందే కాకుండా ముంబైని అథ:పాతాళానికి తొక్కేశాడని. రోహిత్ శర్మను అవమానించాడని...ముంబై ను నిలువునా ముంచేశాడని..తిట్లు శాపనార్థాలు..మనిషనే వాడికి ఎదురు అవకూడనంతా ట్రోలింగ్. కానీ హార్దిక్ పాండ్యా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భూదేవికి ఉన్నంత సహనంతో ఓపికగా ఎదురు చూశాడు. రెండు నెలలు తిరిగే సరికి ప్రపంచం అంతా మారిపోయింది. నాడు ఐపీఎల్ లో జీరో అనిపించుకున్నవాడే నేడు వరల్డ్ కప్ లో హీరో. ఆఖరి ఓవర్లో 16పరుగులు చేస్తే సౌతాఫ్రికాదే వరల్డ్ కప్. కానీ పాండ్యా అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశాడు. ప్రమాద కర డేవిడ్ మిల్లర్, కాగిసో రబాడాలను ఔట్ చేశాడు. టీమిండియాకు 7పరుగుల తేడాతో తిరుగులేని విక్టరీనిచ్చి వరల్డ్ కప్ తీసుకొచ్చి చేతిలో పెట్టేశాడు. అంతే ఎక్కడ లేని ఎమోషన్. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. చిన్నపిల్లాడిలా వల వలా ఏడ్చేశాడు. భారత జెండా పట్టుకుని గ్రౌండ్ మొత్తం తిరుగుతూ సగర్వంగా తన ఉనికిని చాటుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో మూడువికెట్లు తీసి ఫైనల్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా నిలవటమే కాదు ఈ వరల్డ్ కప్ అంతా పాండ్యా చూపించిన ఆల్ రౌండ్ షో నెక్ట్స్ లెవల్. బ్యాట్ తో హాఫ్ సెంచరీలు...బంతితో వికెట్లు...కత్తికి రెండు వైపులా పదును చూపిస్తూ టీమిండియాను విశ్వవిజేతగా నిలపటంలో కీలకపాత్ర పోషించాడు. లైఫ్ ఇచ్చే రెండో ఛాన్స్ ఫర్ఫెక్ట్ గా వాడుకుని తలరాతను మార్చుకున్నాడు. ఐపీఎల్ లో జోరో అనిపించుకున్నవాడే ఈ రోజు వరల్డ్ కప్ హీరో అని అభిమానులు కీర్తించుకునే స్థాయిని సంపాదించుకున్నాడు.