Gautam Gambhir Team India Head Coach | టీమిండియా హెడ్ కోచ్ గా రావటమే కాదు అంతకు మించి గంభీర్ ప్లాన్
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ రానున్నారనే విషయం దాదాపుగా కన్ఫర్మ్. కానీ గంభీర్ వచ్చాక ఎలాంటి మార్పులు జరుగనున్నాయనే. ప్రధానంగా బీసీసీఐ ఇంటర్వ్యూలో గంభీర్ చెప్పింది ఒకటే..2026 టీ ట్వంటీ వరల్డ్ కప్, 2027 వన్డే వరల్డ్ కప్ లను దృష్టిలో పెట్టుకుని టీమ్స్ తయారు చేయాలని. ఇందుకోసం వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు ఉన్నా పర్వాలేదనే విషయాన్ని బోర్డు ముందు ఇంటర్వ్యూలో ప్రస్తావించాడట గంభీర్. అంటే టెస్టుకు విడిగా ఓ జట్టు, వన్డేలకు విడిగా మరో జట్టు,, టీ20 లకోసం ఓ ప్రత్యేక జట్టు. ఇలా వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు టీమ్స్ ఉన్నా మూడు ఫార్మాట్లు ఆడగలిగే ప్లేయర్లు మూడింటిలోనూ ఉంటారు. కోచ్ వీటిని సమన్వయం చేసుకుంటూ టీమ్స్ ముందుకు నడిపించే బాధ్యతను తీసుకుంటాడు. ఐపీఎల్ కారణంగా రిజర్వ్ బెంచ్ బలం బాగా పెరిగింది కాబట్టి టీ20 ల కు టీమ్ సెలెక్షన్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీ, విజయ్ హజారే ట్రోఫీల ద్వారా వన్డే టీమ్ కు జట్టు, రంజీల ద్వారా టెస్టు టీమ్ లకు ప్రతిభ గల ఆటగాళ్లను తీసుకురావాలనే ప్రతిపాదనలను గంభీర్ ఉంచాడు. అంతే కాదు జట్టులో ఇప్పుడున్న సీనియర్ ఆటగాళ్లకు 32-36 వయస్సు మధ్యలో ఉన్న వాళ్లు మరో మూడు నాలుగేళ్ల తర్వాత వైట్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం లేనందున వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పినట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా గంభీర్ ప్రతిపాదనలను కోచ్ సెలెక్షన్ కమిటీ కూడా అంగీకరించినట్లు బీసీసీఐ కూడా దీనిపై సానుకూలంగా ఉందని ఆకాశ్ చోప్రా తెలిపారు. సో గంభీర్ హెడ్ కోచ్ గా వస్తే ముఫ్పైలు దాటిన విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ల ఫ్యూచర్ ఏంటి అని డిసైడ్ అయిపోతుంది. వచ్చే వరల్డ్ కప్ లను దృష్టిపెట్టుకుని టీమ్ సెలక్షన్ ఉంటుంది కాబట్టి ఫిట్ నెస్ లేకపోయినా..ఆటగాడిగా తరుచూ విఫలమవుతున్నా మునుపటి బ్రాండ్ నేమ్ తో కొనసాగే పరిస్థితులను గంభీర్ కల్పించకపోవచ్చనే టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ మిస్టర్ అగ్రెసివ్ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఐపీఎల్ విజేతగా నిలబెట్టినట్లు టీమిండియాను విశ్వవిజేతగా నిలుపుతాడా లేదా అని.