Gautam Gambhir Salary As Team India Head Coach | ఏడాదికి గంభీర్ కు జీతమెంతో తెలుసా..! | ABP Desamc

Continues below advertisement

Gautam Gambhir Salary As Team India Head Coach | టీం ఇండియా హెడ్ కోచ్ గా గంభీర్ ఎంత జీతం తీసుకోబోతున్నారు..? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..!ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. మరి ఈ బోర్డు కింద హెడ్ కోచ్ అంటే శాలరీ కూడా కొట్లల్లో ఉంటుంది.అందులో నో డౌట్. రాహుల్ ద్రావిడ్ కు సుమారు ఏడాదికి 12 కోట్ల జీతం చెల్లించేవారట. అంటే నెలకు కోటి రూపాయలు అనమాట. ఇప్పుడు గంభీర్ దానికంటే ఎక్కువ ప్యాకేజీ డిమాండ్ చేశారట. కేకేఆర్ మెంటర్ గా గంభీర్ సుమారు 25 కోట్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే.. గంభీర్ బయట వివిధ బిజినెస్ ల్లో బాగా సంపాదిస్తారు.అదే..టీం ఇండియా హెడ్ కోచ్ 11 నెలలు టీమ్ తో పాటే ఉండాలి. సో.. గంభీర్ కు ప్రస్తుతమున్న కమిట్మెంట్స్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండే శాలరీ ఇస్తేనే కోచ్ గా వస్తానని గంభీర్ చెప్పారట. అందుకే.. ఆ శాలరీని ఒప్పుకోవడం కోసమే బీసీసీఐ ఇన్నాళ్లు వెయిట్ చేసిందని ప్రచారం జరుగుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram