Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam

ఐపీఎల్ 2026 కౌంట్‌డౌన్ మొదలైంది. అయితే క్రికెట్ ప్రపంచాన్ని ఇప్పుడు ఒకటే ప్రశ్న వెంటాడుతుంది. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజనా? అని. 44 ఏళ్ల వయస్సులో తన 19వ సీజన్‌కు సిద్ధమవుతున్న తల భవిష్యత్తుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. "ధోనీ ఏం చేయాలో నేను నేరుగా ధోనీకే చెబుతాను కానీ మీడియాకు కాదు" అంటూ దాదా స్పష్టం చేశారు. తానే స్వయంగా ధోనీతో పర్సనల్‌గా మాట్లాడతానని ఆయన హిట్ ఇవ్వడంతో, ధోనీ రిటైర్మెంట్ ప్లాన్ గంగూలీకి ముందే తెలుసా అనే చర్చ మొదలైంది.

మరోవైపు ఆకాష్ చోప్రా మాత్రం ఈ సీజనే ధోనీకి లాస్ట్ అంటూ చెప్పుకొస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రాజస్థాన్ రాయల్స్ నుండి సంజూ శాంసన్ సీఎస్కేలోకి రావడం. 18 కోట్లకు సంజూని దక్కించుకున్న చెన్నై, అతడిని ధోనీ వారసుడిగా సిద్ధం చేస్తోంది. వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా సంజూనే తీసుకునే అవకాశం ఉంది. ధోనీ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే కనిపిస్తారని నిపుణులు అంటున్నారు. మరి ఈ సీజన్‌లో ధోనీ హెలికాప్టర్ షాట్లతో ఘనంగా వీడ్కోలు పలుకుతారా? లేదా మెంటర్ గా కనిపిస్తారా అనేది చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola