Ganguly as Pretoria Capitals Head Coach | ప్రిటోరియా క్యాపిటల్స్ కోచ్ గా గంగూలీ | ABP Desam

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొత్త బాధ్యతలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. మొదటి సారి సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ SA20 లో ప్రిటోరియా క్యాపిటల్స్​కు ప్రధాన కోచ్​గా నియమితులయ్యారు. ప్రిటోరియా క్యాపిటల్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంది. గంగూలీ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కానీ ఒక టీం కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. టీమ్ఇండియా కెప్టెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గంగూలీ తన టీం కు ఎన్నో విజయాలు అందించాడు. కష్ట కాలంలో ఉన్నప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోని జట్టును అద్భుతంగా నడిపించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా టీం ఇండియాకు సేవలు అందించిన గంగూలీ ... ఇప్పుడు మొదటిసారిగా ఓ జట్టుకు హెడ్ కోచ్​గా బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పటి తనలోని ఫైర్ ను బయటకు తీసి టీ20 క్రికెట్ జమానాలోనూ గంగూలీ తన సత్తా చాటుతాడేమో మాత్రం చూడాల్సి ఉంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola