England Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desam

Continues below advertisement

 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాయి. చాలా జట్లు తమ కోర్ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవటానికే మొగ్గు చూపాయి. అయితే అన్నీ టీమ్ ల రిటెన్షన్ ప్లేయర్లను లిస్ట్ ను పరిశీలిస్తే అర్థం అయ్యింది ఏంటంటే ప్రతీ టీమ్ కూడా ఇంగ్లండ్ ప్లేయర్లను మాకొద్దు బాబోయ్ అని వదిలేసింది. దీని వెనుక ఓ భారీ రీజనే ఉంది. అదేంటంటే లాస్ట్ ఇయర్ వరకూ ఐపీఎల్ మ్యాచ్ లు మొదలైతే ఆ ఇంగ్లండ్ ప్లేయర్లు ఎప్పుడు వచ్చి ఆడతారో ఎప్పుడు స్వదేశం వెళ్లిపోతారో వాళ్లకు కూడా తెలియదు. చివరి సీజనే చూడండి రాజస్థాన్ కు కీలక బ్యాటర్ అయిన జోస్ బట్లర్ లీగ్ క్రూషియల్ స్టేజ్ లో టీమ్ ను వదిలివెళ్లిపోయాడు. పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ గా ఉన్న శామ్ కర్రన్ కూడా అంతే. నాయకుడిగా ముందుండి నడిపించాల్సిన వ్యక్తి అర్థాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇక బెన్ స్టోక్స్ నమ్ముకుని చెన్నై సూపర్ కింగ్స్ అయితే గట్టి దెబ్బే తింది. మనోడు ఆక్షన్ లో  2023లో 16కోట్ల 25లక్షలు పెట్టి కొంటే రెండు మ్యాచ్ లు ఆడి గాయం సాకు చూపించి వెళ్లిపోయాడు. 2024 లో అయితే వర్క్ లోడ్ సాకు చూపించి అసలు సీజన్ కే రాలేదు.  ఇదంతా చెన్నైకి భారీ నష్టమే కదా. ఆర్సీబీ లో సెంచరీ బాదిన విల్ జాక్స్, పంజాబ్ ను కీలక బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ ఇలా ఓ పెద్ద లిస్టే ఉంది. వీళ్లకంతా ఇంగ్లండ్ దేశానికి ఆడటం ప్రయారిటీ. అది తప్పు కాదు. కానీ ఐపీఎల్ కి కాంట్రాక్టు ఒప్పుకుని సీజన్ మధ్యలోనే వెళ్లిపోతూ లేదా వాళ్లకు ఖాళీ ఉన్నప్పుడో ఆడుకుంటూ వాళ్లను తీసుకుంటున్న టీమ్స్ కి తలనొప్పిగా మారారు. ఈ చర్యలతో విసిగిపోయాయో ఏమో ఏ టీమ్ కూడా ఇంగ్లండ్ ప్లేయర్లను ఉంచుకోకుండా రిలీజ్ చేసేశాయి. మరి వీళ్లను ఆక్షన్ లోనైనా కొనుక్కుంటారో లేదా పాకిస్థాన్ క్రికెటర్లలలా ఆంగ్లేయులపైనా నిషేధం విధిస్తారో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram