Eng vs Ind Test Series Draw 2-2 | ఇంగ్లండ్ ను వణికించిన భారత పేసర్లు Mohammed Siraj, Prasidh Krishna | ABP Desam

  ఇంగ్లండ్ ఊహించి కూడా ఉండదు. మనం ఓవల్ టెస్టు గెలుస్తామని. రీజన్ మనోళ్లు 374 పరుగుల లక్ష్యం ఇస్తే...వాళ్లు సునాయాసంగా చేధించేలా కనిపించారు. బెన్ డకెట్ 54పరుగులతో ఇంగ్లండ్ కు కావాల్సిన ఆరంభం ఇస్తే...జోరూట్, హ్యారీ బ్రూక్ సెంచరీలతో కదం తొక్కారు. రూట్ 105 పరుగులతో సెంచరీ బాదితే...హ్యారీ బ్రూక్ బాజ్ బాల్ స్టైల్ లో ఆడి 111 పరుగులు చేశాడు.  ఓ దశలో 301 కి కేవలం 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 362కి ఆలౌట్ అయిపోతారని ఎవ్వరూ అనుకుని లేదు. కానీ అటు మహమ్మద్ సిరాజ్ ఇటు ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం పట్టు వదల్లేదు. మొదటి ఇన్నింగ్స్ లో చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ ను 247పరుగులకు ఆలౌట్ చేసిన సిరాజ్, ప్రసిద్ధ్ రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లండ్ ను చావు దెబ్బ తీశారు. సెంచరీలు చేసేశాం మ్యాచ్ మాదే అనే ధీమాలోకి వెళ్లిపోయిన ఇంగ్లండ్ ను పాతబంతితో రివర్స్ స్వింగ్ లాగుతూ వణికించేశారు. ఐదో టెస్టు నాలుగో రోజు మూడో సెషన్ నుంచి మొదలైన సిరాజ్, ప్రసిద్ధ్ విజృంభణ ఐదో రోజు ఉదయానికి మరింత పీక్స్ కి వెళ్లింది. ప్రత్యేకించి సిరాజ్ వేసిన స్వింగ్ బాల్స్ కి ఇంగ్లండ్ టెయిలెండర్స్ దగ్గర సమాధానమే లేదు. అలా ప్రసిద్ధ్ రెండో ఇన్నింగ్స్ లోనూ 4వికెట్లు తీసి మొత్తం మ్యాచ్ లో 8 వికెట్లు సాధిస్తే..సిరాజ్ మియా మరింత పీక్ ఫామ్ ను చూపించి ఏకంగా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకుని ఐదో టెస్టులో మొత్తం తొమ్మిది వికెట్లు సాధించి పాతబస్తీ కుర్రోడి దమ్ము ఇంగ్లండ్ లో చూపించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola