Eng vs Ind 5th Test Day 2 Highlights | అత్యంత ఆసక్తికరంగా మారిపోయిన లండన్ ఓవల్ టెస్టు | ABP Desam

 ఇంగ్లండ్, భారత్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చేసింది. పైగా వర్షం కారణంగా పలు మార్లు ఆగుతూ జరుగుతూ వస్తున్న మ్యాచ్ సూపర్ టర్న్ తీసుకుంది. ముందు ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ దిగిన టీమిండియాకు మిగిలిన నాలుగు వికెట్లను కేవలం ఆరు పరుగుల తేడాతో లేపేసింది ఇంగ్లండ్. హాఫ్ సెంచరీ కొట్టిన ఊపు మీదున్న కరుణ్ నాయర్ ఆదుకుంటాడని భావించినా అలాంటి అద్భుతాలేమీ జరగలేదు. ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకే ఢమాల్ అంది. గస్ అట్కిన్ సన్ ఐదు వికెట్లు తీశాడు. సరే మన బౌలర్లు ఏమన్నా మ్యాజిక్ చేస్తారేమోలే అని ఎక్సెప్ట్ చేసిన ఫ్యాన్స్ కు స్టార్టింగ్ లో షాక్. ఇంగ్లండ్ తమదైన స్టైల్ లో బాజ్ బాల్ గేమ్ మొదలెట్టింది. ఫలితంగా వికెట్లు సంగతి పక్కన పెట్టి కనీసం పరుగులు కూడా ఆపలేకపోయారు భారత బౌలర్లు. వన్డేలో స్టైల్ లో మ్యాచ్ ఆడిన ఓపెనర్లు జాక్ క్రాలీ 64 పరుగులు, బెన్ డకెట్ 43 పరుగులు చేశారు. ఆకాశ్ దీప్ మంచి లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ కారణంగా డకెట్ ఔట్ అవ్వటంతో మొదటి వికెట్ 92 పరుగులకు పడింది. అప్పటికి ఇంగ్లండ్ ఆడింది 12.5ఓవర్లే. అంత స్పీడ్ గా ఆడుతున్నారు. ఓ దశలో ఒక్క వికెట్ నష్టానికి 129పరుగులు చేసిన ఇంగ్లండ్..ఈజీగా 400 కొడుతుందేమో అనిపించింది. కానీ మన అక్కడే మన బౌలర్లు అనూహ్యం విజృంభించారు. ప్రత్యేకించి సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ దుమ్ము లేపటంతో….ఇంగ్లండ్ వికెట్లు టపాటపా కూలాయి. ఓ పక్క హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీతో నిలబడినా...మిగిలిన బ్యాటర్లు అంతా ఇలా వచ్చి అలా వెళ్తుండటంతో అనూహ్యంగా 247పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. సిరాజ్, ప్రసిద్ధ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. 23పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది ఇంగ్లండ్ కు. తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 75పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ దూకుడు ఆడుతూ హాఫ్ సెంచరీ కొట్టి నాటౌట్ గా ఉన్నాడు. రాహుల్, సాయి సుదర్శన్ అవుటయ్యారు. చూడాలి మూడో రోజు భారత్ ఎంత సేపు నిలబడుతుంది అనేదాన్ని బట్టి ఈ మ్యాచ్ గెలిచి మనోళ్లు సిరీస్ ను సమం చేస్తారా...లేదా పేక మేడలా కూలి మ్యాచ్ ను సమర్పించుకుంటారా...మూడో రోజు డిసైడ్ అవుతుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola