Eng vs Ind 3rd test First Innings Highlights | లార్డ్స్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయిన ఇంగ్లండ్ | ABP Desam
రోజున్నర సుదీర్ఘ జిడ్డు బ్యాటింగ్ తర్వాత ఇంగ్లండ్ ఎట్టకేలకు లార్డ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు బ్యాటింగ్ ను ప్రారంభించిన రూట్, స్టోక్స్ కాసేపు ధాటిగానే ఆడారు. ఈ క్రమంలో జో రూట్ తన కెరీర్ లో 37వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.అయితే స్టోక్స్ 44 పరుగుల మీద ఉన్నప్పుడు బుమ్రా యార్కర్ కు బలవ్వటంతో ఇంగ్లండ్ వికెట్ల పతనం ప్రారంభమైంది. కాసేపటికే రూట్, క్రిస్ వోక్స్ లను కూడా బుమ్రా పెవిలియన్ దారి పట్టించాడు. కానీ కీపర్ స్మిత్...బ్రైడన్ కార్సే తో కలిసి బౌండరీల మోత మోగించాడు. 271పరుగులకే 7వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఈ ఇద్దరి దూకుడైన ఆటతీరుతో 387పరుగులు చేసింది. జేమీ స్మిత్ ను సిరాజ్ అవుట్ చేయగా...జోఫ్రా ఆర్చర్ ను ఔట్ చేసిన బుమ్రా 5వికెట్ల ఘనతను సాధించాడు. తద్వారా విదేశాల్లో 13వసారి 5వికెట్ల ఘనతను అందుకుని ఆ అరుదైన రికార్డు సాధించిన తొలి భారతీయ బౌలర్ గా నిలిచాడు బూమ్ బూమ్ బుమ్రా. చివరికి కార్సేను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయటంతో ఇంగ్లండ్ 387పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ తోక తో మనల్ని కొట్టినా వాళ్లు నిన్నంతా ఆడిన జిడ్డు బ్యాటింగ్ లార్డ్స్ టెస్టు డ్రా కాకుండా ఉండాలంటే భారత్ ఇంగ్లండ్ వాళ్ల బాజ్ బాల్ స్టైల్ లో ఆడి మ్యాచ్ లో దూకుడును తీసుకురావాలి.