Eng vs Ind 3rd Test Day 4 Highlights | అత్యంత ఆసక్తికరంగా మారిపోయిన లార్డ్స్ టెస్టు | ABP Desam

 బాజ్ బాల్ అని ఇంగ్లండ్ పొగరుగా చెప్పుకునే ఆట ఇదే. లక్ష్యం చిన్నదే కావచ్చు..కానీ ఆ చిన్న లక్ష్యాన్ని చేధించనివ్వకుండా విరుచుకుపడతారు. ఆ చిట్టి లక్ష్యమే కొండంతై కనిపించేలా బెదరగొట్టేస్తారు. సరిగ్గా లార్డ్స్ టెస్టులో భారత్ పై ఇంగ్లండ్ అదే చేస్తుంది. భారత బౌలర్ల అద్భుత పోరాటంతో ప్రత్యేకించి వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో ఇంగ్లండ్ పై రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీయంతో... భారత్  లార్డ్స్ టెస్టులో ఎక్కడా లేని పట్టు సాధించింది అని సంబరపడిపోయాం. ఆతిథ్య జట్టు 193పరుగుల లక్ష్యమే ఇస్తే ఉఫ్ మని ఊదేయొచ్చులే అని ఆనందపడే లోపు ఇంగ్లండ్ బౌలర్లు బంతితో నిప్పులు చెరిగారు. ఫలితంగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4వికెట్లు కోల్పోయి 58పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 13పరుగులే చేసిన జైశ్వాల్ రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అవ్వటం భారత్ లయను దెబ్బతీసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 40 పరుగులతో ఫర్వాలేదనిపించిన కరుణ్ నాయర్ రెండో ఇన్నింగ్స్ లో 14పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ శుభ్ మన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లోనూ ఫెయిల్ అవటం, నైట్ వాచ్ మన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ రోజులో చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అవ్వటంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. బ్రైడాన్ కార్సే రెండు వికెట్లు తీస్తే..బెన్ స్టోక్స్ , జోఫ్రా ఆర్చర్ చెరో వికెట్ తీశారు. ఇక మిగిలిందల్లా భారత ఆశాకిరణం మిస్టర్ డిపెండబుల్ కేఎల్ రాహుల్ 33 పరుగులతో ఉంటే..ఇవాళ రాహుల్ కి తోడుగా పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఎంత మేరకు సహకరిస్తారనే దానిపైనే భారత ఫలితం ఆధారపడనుంది. 135పరుగులు చేస్తే మనోళ్లు లార్డ్స్ లో చారిత్రాత్మక విజయం అందుకుంటారు. మిగిలిన ఆరు వికెట్లు లేపేస్తే ఇంగ్లండ్ సంచలన విజయం సాధిస్తుంది. చూడాలి లార్డ్స్ టెస్టులో విజేతలుగా నిలిచేది ఎవరో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola