Eng U19 vs Ind U19 First Innings | U19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు | ABP Desam

కుర్రాళ్లు కుమ్మేశారు. అలాగ్గా ఇలాగ్గా కాదు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ కుర్ర బౌలర్లకు చక్కుల చూపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ చూపించిన విశ్వరూపానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు విస్తుపోయారు. మరో ఓపెనర్ అరోన్ జార్జ్ 20 పరుగుల టీమ్ స్కోర్ కే వెనుదిరిగినా...కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిపోయాడు. కేవలం 80 బంతులు మాత్రమే ఆడిన 14ఏళ్ల వైభవ్.. 15ఫోర్లు, 15 సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ దాటికి ఏ ఇంగ్లండ్ బౌలర్ దగ్గర సమాధానమే లేకపోయింది. ఆయుష్ మాత్రే 53 పరుగులతో వైభవ్ కే ఎక్కువ స్ట్రైక్ రొటేట్ చేయగా...చిచ్చరపిడుగు సూర్యవంశీ చెలరేగిపోయాడు. సెంచరీ, నూటయాభై అంటూ పరుగులు దాటుతున్నా కానీ అస్సలు అలిసిపోలేదు సూర్యవంశీ. డబుల్ సెంచరీ చేసేసే ఊపులో కనిపించినా 175పరుగుల వద్ద కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సూర్యవంశీ ఔటైనా తర్వాత వచ్చిన వేదాంత్, విహాన్, అభిగ్యాన్ కుందు బాధ్యతాయుతంగా ఆడారు. చివర్లో కనిష్క్ 37పరుగులు చేసి మంచి ఫినిషింగ్ ఇవ్వటంతో భారత్ 50ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల స్కోరు చేసింది. U19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. మరి భారత్ ఇచ్చిన 412 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్ ఏం చేస్తుందో చూడాలి. బ్రిటీషర్లు తడబడితే మాత్రం భారత్ అండర్ 19 విశ్వవిజేతగా నిలవటం ఖాయం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola